
(సాక్షి నాలెడ్జ్‌సెంటర్) : చైనా ప్రజా విప్లవం(1949) నుంచీ పాలకపక్షంగా కొనసాగుతున్న చైనా కమ్యూనిస్ట్‌పార్టీ(సీపీసీ) 19వ మహాసభలు(కాంగ్రెస్) బుధవారం ప్రారంభమౌతున్న నేపథ్యంలో ప్రస్తుత ప్రధాన నేత(కోర్‌లీడర్) జీ జిన్‌పింగ్‌ఎంతటి బలమైన నేతగా ఆవిర్భవిస్తారనేది చర్చనీయాంశమైంది. విప్లవకాలంలో పార్టీని విజయపథంలో నడిపించిన మావో జెడాంగ్‌తర్వాత డెంగ్‌జియావోపింగ్‌చైనా అగ్రనేతగా పేరు తెచ్చుకున్నా పార్టీలో, ప్రభుత్వంలో పెద్ద పదవేమీ తీసుకోలేదు. అయినా నేతలందరి అభిప్రాయాలనే సేకరించి పార్టీలోని వివిధ ప్రాంతాలు, వర్గాల నేతలతో సంకీర్ణాన్ని నిర్మించారు. ఈ సంకీర్ణం నాయకత్వానే ఎవరూ ఊహించని ఆర్థిక సంస్కరణలను చైనాలో విజయవంతంగా అమలయ్యేలా డెంగ్‌పునాదులు వేశారు.
చైనాను ప్రపంచ ఆర్థికశక్తిగా మార్చిన జిన్‌పింగ్
చైనా అన్ని విధాలా అగ్రరాజ్యంగా ఆవిర్భవించింది ప్రస్తుత నేత జిన్‌పింగ్‌హయాంలోనే(2012 నుంచి). రెండోసారి సీపీసీ ప్రధానకార్యదర్శి పదవిని 19వ కాంగ్రెస్‌లో చేపట్టాక ఆయన అధికార కేంద్రీకరణ మార్గంలో పయనిస్తారేమోననే భయాందోళనలు చైనాలో వ్యక్తమౌతున్నాయి. ఈ పరిస్థితుల్లో జిన్‌పింగ్‌కూడా గోర్బచ్యోవ్‌మాదిరిగా కొంత ధైర్యం చేసి ఇటీవల చైనాలో అగ్రపదవుల్లోని అధికారులు, నేతల అవినీతిని అరిక్టడానికి తగిన చర్యలు తీసుకున్నారు. ఎదుగూబొదుగూ లేని చైనా కార్మికుల జీతాలు బాగా పెంచారు. చైనా ఆర్థికవృద్ధి రేటు కొద్దిగా మందగించినా ఫరవాలేదుగాని సీపీసీ కనున్నల్లో నడిచే ప్రభుత్వ వ్యవస్థ కూలిపోకూడదనే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారనే ప్రశంసలు కూడా అందుకున్నారు. సీపీసీలో, ప్రభుత్వంలో పూర్తి పట్టు సాధించి తన మార్గంలో పయనించేవారికి పదోన్నతులు కల్పించారు. అవితీతిపరులుగా తేలిన కమ్యూనిస్ట్‌నేతలను ఇంటికి సాగనంపారు. కాని, కిందటేడాది తనను కోర్‌లీడర్‌గా ప్రకటింకున్నప్పటి నుంచీ వ్యక్తి పూజను జిన్‌పింగ్‌ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి.
సీపీసీ కాంగ్రెస్‌తర్వాత రాజ్యాంగ సవరణతో అధికార కేంద్రీకరణ?
ఇప్పటికే బలమైన నేతగా అవతరించిన జిన్‌పింగ్ సీపీసీ మహాసభల్లో 70 శాతం పదవుల్లోకి కేవలం తన అనుయాయులనే తీసుకొచ్చి, తర్వాత తన పెత్తనాన్ని పటిష్టం చేసే విధంగా రాజ్యాంగాన్ని సవరిస్తారనే కొందరు అంచనావేస్తున్నారు. 19వ సీపీసీ కాంగ్రెస్‌లో రెండోసారి నాయకత్వం చేపట్టాక ఆయన మావోలా మారతారా? లేక డెంగ్‌మాదిరిగా అందర్నీ కలుపుకుపోయే సంకీర్ణ నేతగా చైనాను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళతారా? అనే విషయం సమీప భవిష్యత్తులో తెలుస్తుంది. 138 కోట్ల జనాభా, 95 లక్షల చదరుపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న దేశాన్ని సంపూర్ణ అధికారాలతో ‘సుప్రీం లీడర్’గా జీపింగ్‌అవరిస్తే అది ఏకపార్టీ పాలనలోని చైనాకేగాక యావత్‌ప్రపంచానికి మంచిది కాదని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment