మరణాన్ని ముందే తెలుసుకోవచ్చు! | DNA clock can predict lifespan | Sakshi
Sakshi News home page

మరణాన్ని ముందే తెలుసుకోవచ్చు!

Published Mon, Feb 2 2015 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 8:38 PM

మరణాన్ని ముందే తెలుసుకోవచ్చు!

మరణాన్ని ముందే తెలుసుకోవచ్చు!

లండన్: భవిష్యత్తు గురించే కాదు మరణం ఎప్పుడు సంభవిస్తుందో కూడా తెలుసుకోవాలని మనందరికీ ఉంటుంది. శాస్త్రవేత్తలు కూడా దీనిపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనిషి డీఎన్‌ఏలో రసాయన మార్పులను బట్టి అవయవాల పనితీరు, వాటి వయసును తెలిపే జీవగడియారాన్ని ఎడిన్‌బరో వర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని ద్వారా మనిషి జీవిత కాలాన్ని గుర్తించవచ్చని వారు అంటున్నారు.

ఈ జీవ గడియారం వయసుకు మనిషి వయసుకు మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి వారు ఓ నమూనా తయారు చేశారు. 5 వేల మంది వృద్ధుల జీవన విధానాన్ని 14 ఏళ్ల పాటు గమనించి దీన్ని రూపొందించారు. దీని ప్రకారం జీవగడియారం వయసుతో సమానంగా ఉన్న వారితో పోలిస్తే వ్యక్తి వయసు కన్నా జీవగడియారం వయసు ఎక్కువగా ఉన్న వారు మరణానికి దగ్గరగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు.

దీంతో పాటు ధూమపానం, మధుమేహం, హృద్రోగ వ్యాధుల ద్వారా సంభవించే మరణాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. జీవన విధానం, జన్యు కారకాల్లో ఏది జీవ గడియార వయసును ప్రభావితం చేస్తుందో స్పష్టంగా తెలియరాలేదని మారియోని అనే శాస్త్రవేత్త తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement