డోక్లామ్‌ : మా సార్వభౌమాధికారానికి ప్రతీక | Doka La pass is our sovereignty | Sakshi
Sakshi News home page

డోక్లామ్‌ : మా సార్వభౌమాధికారానికి ప్రతీక

Published Sat, Oct 7 2017 9:31 AM | Last Updated on Sat, Oct 7 2017 9:31 AM

Doka La pass is our sovereignty

బీజింగ్‌ : చైనా డ్రాగన్‌ మళ్లీ డోక్లామ్‌ వద్ద బుసలు కొడుతోంది. గతంలో 70 రోజులకు పైగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు తెరతీసిన చైనా.. మళ్లీ పాత పాటే పాడుతోంది. డోక్లామ్ ప్రాంతం మా సరిహద్దులోకే వస్తుందంటూ సైన్యం ముందుకు జరిగింది. అంతేకాక డోక్లామ్‌ వద్ద చైనా సైన‍్యం కవాతు నిర్వహించింది. డోక్లాం ప్రాంతం చైనా సార్వభౌమాధికారం కిందకే వస్తుందని తాజాగా చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మా సైన్యం అక్కడ కవాతు చేయడం, సరిహద్దు రక్షణను పర‍్యవేక్షించడం అనేది మా సార్వభౌమాధికారానికి ప్రతీకగా చైనా పేర్కొంది. డోక్లాం సరిహద్దు అనేది చైనా చారిత్రక విశిష్టతకు సంకేతం అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఇదిలా ఉండగా గతంలో జూన్‌ 16న మొదలైన డోక్లాం వివాదం.. భారత్‌-చైనా పరస్పర అంగీకార ఒప్పందంతో ఆగస్టు 28న ముగిసిన విషయం తెలిసిందే. అయితే రెండుమూడు వారాలుగా చైనా మళ్లీ డోక్లామ్‌ విషయంలో పాతపాటే పాడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement