న్యూ ఇయర్ వేళా యూరప్‌ను వీడని ఉగ్రభూతం! | European cities tighten security ahead of New Year celebrations | Sakshi
Sakshi News home page

న్యూ ఇయర్ వేళా యూరప్‌ను వీడని ఉగ్రభూతం!

Published Thu, Dec 31 2015 3:09 PM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

న్యూ ఇయర్ వేళా యూరప్‌ను వీడని ఉగ్రభూతం! - Sakshi

న్యూ ఇయర్ వేళా యూరప్‌ను వీడని ఉగ్రభూతం!

ప్రపంచంలోని అన్ని దేశాలు మరికొన్ని గంటల్లో నూతన సంవత్సర వేడుకల్లో మునిగిపోనుండగా ఈసారి యూరోపియన్ దేశాలు మాత్రం ఆ వేడుకలను తిలకించే పనికే పరిమితమైనట్లు తెలుస్తోంది.

లండన్: ప్రపంచంలోని అన్ని దేశాలు మరికొన్ని గంటల్లో నూతన సంవత్సర వేడుకల్లో మునిగిపోనుండగా ఈసారి యూరోపియన్ దేశాలు మాత్రం ఆ వేడుకలను తిలకించే పనికే పరిమితమైనట్లు తెలుస్తోంది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రభూతం ఇప్పుడు ఆ దేశాలను పరోక్షంగా వణికిస్తోంది. ఎలాంటి మతాబులు చప్పుళ్లు లేకుండా, రంగుల వెలుగుల్లో వేడుకలకు దూరంగా ఉండి కేవలం ఇతర దేశాల్లో జరిగే కొత్త సంవత్సర వేడుకలను పరిశీలించేందుకు అక్కడి ప్రజలు మానసికంగా సిద్ధమైనట్లు సమాచారం.

దీనంతటికి ప్రధాన కారణం రెండు నెలల కిందట ఫ్రాన్స్ లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అనూహ్య దాడులతో విరుచుకుపడటమే. ఎప్పుడు ఎలా, ఎటునుంచి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడులు చేస్తారోనని కొత్త సంవత్సర వేళ యూరోపియన్ దేశాలు భయాందోళనలో పడ్డాయి. వాస్తవానికి అక్కడి ఇంటెలిజెన్స్‌ వర్గాల సమాచారం కూడా వారి భయాన్ని మరింత రెట్టింపు చేసేట్లుగానే ఉన్నాయి. అదీ కాకుండా ఈ దేశాల్లో ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు అవుతుండటంతో పెద్దమొత్తంలో ఓ చోట కేంద్రీకృతమై కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునే కార్యక్రమానికి ఈ ఒక్క ఏడాది దాదాపు ఎడం పాటించాలని వారంతా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఫ్రాన్స్ లో దాడి జరిగినప్పటి నుంచి బెల్జియం చాలా అప్రమత్తమై డేగకన్నుతో వ్యవహరిస్తున్న తీరు కూడా దాడులపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఆ దేశంలో ఇప్పటికే టపాసులపై నిషేధం విధించారు. మూకుమ్మడి వేడుకలకు కూడా పరిమితులు విధించారు. గత ఏడాది దాదాపు లక్షమంది ఒకే వేదిక వద్దకు చేరుకొని న్యూఇయర్ వేడుకల్లో పాల్గొనగా ఈసారి ఆ అవకాశమే లేకుండాపోయింది. అయితే, లండన్ లో మాత్రం అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ వేడుకలు జరగనున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement