చైనాలో జుగుప్సాకరమైన వీడియో బయటకు | Extreme sushi: Stomach-churning moment Chinese diners enjoy a meal of LIVE fish | Sakshi
Sakshi News home page

చైనాలో జుగుప్సాకరమైన వీడియో బయటకు

Published Fri, Mar 18 2016 8:34 AM | Last Updated on Mon, Aug 13 2018 3:30 PM

చైనాలో జుగుప్సాకరమైన వీడియో బయటకు - Sakshi

చైనాలో జుగుప్సాకరమైన వీడియో బయటకు

బీజింగ్: చైనాలో ఓ జుగుప్సకరమైన వీడియో బయటపడింది. మాంసాహారులు కూడా అసహ్యించుకునేలా ఆ వీడియో ఉంది. బతికున్న చేపపిల్లలను కొందరు వ్యక్తులు ఫుల్లుగా మధ్యం సేవించి బతికుండగానే లాగించేశారు. ఈ వీడియో ఆన్లైన్లోకి అడుగుపెట్టడంతో పలువురు వారి తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలో ఏం ఉందంటే.. బీజింగ్ పట్టణంలోని ఓ నివాసంలో కొంతమంది వ్యక్తులు పార్టీ చేసుకునేందుకు వచ్చారు. పార్టీలో భాగంగా మధ్యం తెచ్చుకున్నారు.

అందులోకి సాస్ లాంటిదాన్ని కూడా తయారుచేసుకున్నారు. అయితే, దానిపక్కనే బతికున్న చేపలతో ఉన్న నీటి పాత్రను పెట్టారు. ఇక అనంతరం ఒక్కొక్క సిప్ వేసుకుంటూ గొళ్లున నవ్వుకుంటూ ఆ బతికున్న చేపలను ఆ ఫ్రైసాస్లో పడేసి అవి ప్రాణం కోసం కొట్టుకుంటుండగానే స్పూన్తో నోట్లో వేసుకొని కరకర నమిలేస్తూ గుట్టుక్కుమని మింగేస్తున్నారు. ఇది కాస్త ఆన్ లైన్ లో అడుగుపెట్టి పలువురి ఆగ్రహానికి గురవుతుంది. అయితే, ఇలా బతికున్న చేపలు తింటున్న వీడియోలు బయటకు రావడం ఇదే తొలిసారేం కాదని, తూర్పు ఆసియా ప్రాంతంలో సర్వసాధరణం అని చెప్తున్నారు. కానీ, జంతుప్రేమికులు, మానవతావాదులు ఈ చర్యలను ఖండిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement