స్మార్ట్‌ఫోన్‌తో మెల్లకన్ను...!
లండన్: స్మార్ట్‌ఫోన్ అతిగా వాడే ఐదేళ్లలోపు పిల్లల్లో మెల్లకన్ను వచ్చే ప్రమాదం ఉందని పరిశోధనలో వెల్లడైంది. దక్షిణ కొరియాలోని చొన్నామ్‌వర్సిటీ వైద్యుల బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. ‘ఎక్కువపేపు స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌ను చూస్తు గడిపే పిల్లల కళ్ల రెండు కనుపాపలు అసమానాతరంగా మారి మెల్లకన్ను వస్తుంది.
ఫోన్ స్క్రీన్‌కు, పిల్లల కళ్లకు క 8 నుంచి 12 ఇంచ్‌ల దూరమే ఉంటుంది. దీనివల్ల కళ్లపై ఒత్తిడి పెరిగి కనుపాపలు పైకి, కిందకు, పక్కకు మారే ప్రమాదం ఎక్కువ. స్మార్ట్‌ఫోన్‌ను 2నెలలు వాడని 12 మందిలో 9మంది పిల్లల చూపు బాగా మెరుగుపడింది. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌ను 30 నిమిషాలకంటే కంటే ఎక్కువచూడొద్దు’ అని వైద్యలు చెప్పారు.