అమెరికా అంటే ప్రపంచానికి పెద్దన్న టైపు. దాని సైనిక శక్తి చూసి అంతా భయపడాల్సిందే.. మరి అమెరికన్లు ఏమిటంటే భయపడతారు?
అమెరికా అంటే ప్రపంచానికి పెద్దన్న టైపు. దాని సైనిక శక్తి చూసి అంతా భయపడాల్సిందే.. మరి అమెరికన్లు ఏమిటంటే భయపడతారు? అందరూ అనుకున్నట్లు టైజమేనా.. కాదు.. అమెరికన్లు ఎక్కువగా భయపడే అంశం ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి అట. తర్వాతి స్థానంలో ఉగ్రవాద దాడులు ఉన్నాయి.
అమెరికన్ల భయాలు అనే అంశంపై చాప్‌మాన్ యూనివర్సిటీ 2016లో నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం తేలింది. ఇక నమ్మకాల విషయానికొస్తే.. అగ్ర రాజ్యమైనా దయ్యాలు, ఆత్మలు వంటి వాటిని నమ్మేవారు ఇక్కడ ఎక్కువే. 46.6 శాతం మంది ఆత్మలు వంటివాటిని నమ్ముతారట. అమెరికన్ల టాప్-10 భయాలపై ఓ లుక్కేస్తే..