భారత్ లో విస్తృతంగా అవినీతి: అమెరికా నివేదిక
వాషింగ్టన్: భారత్‌లో అవినీతి అన్ని స్థారుుల్లోనూ విస్తృతంగా వ్యాపించిందని అమెరికా కాంగ్రెస్ అధీకృత నివేదిక ఒకటి పేర్కొంది. దేశంలోని న్యాయవ్యవస్థ సైతం ఇందుకు మినహారుుంపుగా లేదని స్పష్టం చేసింది. 2013లో మానవ హక్కులకు సంబంధించి అమెరికా వార్షిక నివేదికలను విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీ విడుదల చేశారు.
అధికారులు అవినీతికి పాల్పడితే శిక్షించేందుకు చట్టం అవకాశం కల్పిస్తున్నప్పటికీ.. భారత ప్రభుత్వం ఆ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం లేదు. దీంతో అధికారులు యథేచ్చగా అవినీతికి పాల్పడుతున్నారు.
జనవరి-నవంబర్ మధ్యకాలంలో సీబీఐ 583 అవినీతి కేసులు నమోదు చేసింది.
2012లో కేంద్ర నిఘా సంస్థ (సీవీసీ)లో 7,224 కేసులున్నారుు. వీటిలో 5,528 కేసులు 2012లో స్వీకరించినవి కాగా 1,696 కేసులు 2011 నుంచీ ఉన్నారుు.
5,720 కేసుల్లో చర్యలకు సీవీసీ సిఫారసు చేసింది. అవినీతి సంబంధిత సమాచారం ఇచ్చేందుకు, ఫిర్యాదులు దాఖలు చేసేందుకు ఓ వెబ్‌సైట్‌తో పాటు టోల్ ఫ్రీ నంబర్‌ను కమిషన్ ఏర్పాటు చేసింది.
పోలీసు రక్షణ, పాఠశాలలో ప్రవేశం, నీటి సరఫరా వంటి అంశాల్లో వేగవంత చర్యల కోసం లేదా ప్రభుత్వ సాయం కోరుతూ లంచాల చెల్లిం పులు జరుగుతున్నట్టు ఎన్జీవోలు అంటున్నారుు.
పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన వంటి కార్యక్రమాలను కూడా నిర్లక్ష్యపూరిత అమలుతో పాటు అవినీతి పట్టిపీడిస్తోంది.
మహారాష్ట్రలో ఆదర్శ్ హౌసింగ్ స్కాం వంటి వాటిని ప్రస్తావిస్తూ.. వాటిపై చర్యల విషయంలో ప్రభుత్వాల వైఖరిని నివేదిక తప్పుబట్టింది.
2జీ కుంభకోణంలో టెలికం మాజీ మంత్రి ఎ.రాజా, డీఎంకే ఎంపీ కనిమొళిలపై దర్యాప్తు పూర్తి కాకపోవడాన్ని ప్రస్తావించింది. గుజరాత్‌లో లోకాయుక్త ఏర్పాటుకు సంబంధించిన వివాదాన్నీ ఎత్తిచూపింది.