జకార్త : మైనర్ బాలిక అబార్షన్ చేయించుకున్నందుకు స్థానిక కోర్టు బాలికకు ఆరు నెలలు జైలు శిక్షను విధించింది. ఈ ఘటన ఇండోనేషియలో శనివారం చోటుచేసుకుంది.15 ఏళ్ల బాలికపై ఆమె సోదరుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడడంతో బాలిక గర్భం దాల్చింది. మైనర్ బాలిక గర్భం దాల్చడం ఇండోనేషియలో నేరంగా పరిగణిస్తారు. దీనిపై విచారించిన మౌరా బులైనా జిల్లా కోర్టు న్యాయమూర్తి లిస్టో అరిఫ్ బుడిమాన్ శనివారం తీర్పును వెలువరించారు. మైనర్ బాలిక అబార్షన్ చేయించుకున్నందుకు పిల్లల సంరక్షణ చట్టం ప్రకారం బాలికకు ఆరు నెలలు, మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినందుకు ఆమె సోదరుడికి రెండేళ్లు శిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. దీనికి బాలిక తల్లి కూడా సహకరించిందని కోర్టు తెలిపింది.
బాలికపై ఆమె సోదరుడు గత ఏదాది సెప్టెంబర్ నుంచి పలుమార్లు అత్యాచారానికి పాల్పడాడు.ఇండోనేషియలో ఏటా 30 నుంచి 40 శాతం ప్రసూతి మరణాలు సంభవిస్తున్నాయని 2013లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. ఇండోనేషియాలో అమలులో ఉన్న చట్టాలపై ప్రపంచ ఆరోగ్య ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కఠిన చట్టాల మూలంగా మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. బాడిమన్ ఇచ్చిన తీర్పుపై న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారు. మైనర్‌గా ఉండి గర్భందాల్చినందుకు బాలికకు ఏడాది, ఆమె సోదరుడికి ఏడేళ్లు జైలు శిక్షను విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
మైనర్ బాలిక అబార్షన్.. జైలు శిక్ష
Published Sat, Jul 21 2018 8:01 PM | Last Updated on Tue, Oct 2 2018 4:09 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment