
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ ప్రత్యేక డూడుల్‌ను రూపొందించి. ఇందు కోసం ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో ప్రముఖులైన 12 మంది కళాకారుల సంబంధించిన ఫోటోలతో డూడుల్ ఉంచింది. 12 డూడుల్స్‌లో బెంగళూరుకు చెందిన కామిక్స్ ఆర్టిస్ట్ కావేరి గోపాలకృష్ణన్ రాసిన అప్ ఆన్ ది రూఫ్ కూడా ఉంది. టెర్రస్ మీద కూర్చుని పుస్తకాలు చదువుతూ ఉంటోంది ఓ బాలిక. ప్రతి పేజీ చదవడం పూర్తైన తర్వాత ఆమెకు రెక్కలు వచ్చి స్వేచ్ఛగా ఎగిరిపోతుందనేది.. ఈ స్టోరీలోని సారాంశం.
గోపాలకృష్ణన్‌తో పాటు అన్నా హైఫిష్, టిల్లీ వాల్డెన్, ఇజురి, ఫిలిప్పా రైస్, చిహిరో టకయూచి.. ఇలా 12 మంది మహిళలకు సంబంధించిన ఇన్‌క్రెడిబుల్ స్టోరీలతో గూగుల్ డూడుల్స్ రూపొందించింది. అంతాకాకుండా నెటిజన్లు తమ లైఫ్ స్టోరీలను హ్యాష్‌ట్యాగ్ #HerStoryOurStoryతో జతచేసి సోషల్‌మీడియాలో పంచుకోవాలని గూగుల్ సంస్థ కోరింది.
Like many great stories, Kaveri's story started with "once upon a time” too.
— Google India (@GoogleIndia) March 8, 2018
On #IWD2018, we’d love to hear about how you continue to make a difference everyday. Share your story using #HerStoryOurStory. #GoogleDoodle https://t.co/gWwpPaOgsk pic.twitter.com/WeujTcV2Vn