ఒట్టావా : కెనడాలో ఆదివారం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఓ దుండగడు జరిపిన కాల్పుల్లో 16 మంది చనిపోయారు. ఈ ఘటన కెనడాలోని నోవా స్కోటియా పట్టణంలో చోటుచేసుకుంది. మృతుల్లో ఒక మహిళా పోలీసు కూడా ఉన్నారు. అయితే పోలీసుల ఎదురు కాల్పుల్లో దుండగుడు కూడా మృతి చెంది ఉంటాడని అంతా భావిస్తున్నారు. అయితే దీనిని అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. ఇది గత 30 ఏళ్లలో కెనడాలో జరిగిన అత్యంత దారుణమైన ఘటన అని అధికారులు తెలిపారు. చివరిగా 1989లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో 15 మంది మృతిచెందారని గుర్తుచేశారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మాట్లాడుతూ.. గతంలో దంత వైద్యుడిగా పనిచేసిన 51 ఏళ్ల గాబ్రియేల్ వోర్ట్‌మన్ ఈ దాడికి పాల్పడ్డాడని తెలిపారు. పోలీసు దుస్తులు ధరించి, తన కారును కూడా పోలీసు వాహనంలా మార్చి గాబ్రియేల్ ఈ దాడి చేశాడని చెప్పారు. నోవా స్కోటియాలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ గాబ్రియల్ కాల్పులు జరిపాడని పేర్కొన్నారు. ఈ ఘటనలో మరణించిన మహిళ పోలీసును 23 ఏళ్ల హెడీ స్టీవెన్సన్‌గా గుర్తించామని.. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment