వాషింగ్టన్: హెచ్–1బీ వీసాల వల్ల అమెరికన్లకు జరిగే నష్టం లేదని తాజా పరిశోధన ఒకటి స్పష్టం చేసింది. ఈ రకమైన వీసాలున్న విదేశీ ఉద్యోగులు ఉండటం ఉపాధి అవకాశాలను పెంచుతాయని పరిశోధన తెలిపింది. అమెరికా కంపెనీలు విదేశీ ఉద్యోగులతో పని చేయించుకునేందుకు హెచ్–1బీ వీసాలు వీలు కల్పిస్తాయన్నది తెలిసిందే. విదేశీ ఉద్యోగులు.. అమెరికన్ల ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తున్నారని ట్రంప్ ప్రభుత్వం భావిస్తూండగా.. ఇందుకు హేతువు లేదని పరిశోధన చెబుతోంది. హెచ్1బీ వీసాదారుల వల్ల నిరుద్యోగ సమస్య తక్కువగా ఉంటున్నట్లు తెలుస్తోందని ఈ పరిశోధనను నిర్వహించిన నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment