Unemployment Problem
-
కొత్త ఉద్యోగాలు సృష్టించాలంటే ఇది తప్పనిసరి
భారతదేశ దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉన్నప్పటికీ, పెరుగుతున్న ఉద్యోగ డిమాండ్‌ను తీర్చడానికి మాత్రం వృద్ధి రేటు ఎనిమిది శాతం కంటే ఎక్కువగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామరాజన్ స్పష్టం చేశారు. చైనా రాజధాని బీజింగ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇతర దేశాలతో పోలిస్తే ప్రస్తుతం భారతదేశం 6-6.5 శాతం ఆర్థిక వృద్ధి నమోదు చేస్తోందని, కొత్త ఉద్యోగాలు కల్పించేందుకు ఇది సరిపోదని అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థతోపాటు భారత దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను విశ్లేషిస్తూంటారన్నది మనకు తెలిసిన విషయమే. మరోవైపు భారత్‌లో ఏటా నిరుద్యోగం పెరుగుతోంది. దీనికి తోడు ఏటా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉద్యోగ వేటలో పడుతున్నవారి సంఖ్య అధికమవుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ కల్పనలో భాగంగా దేశం ఏ మేరకు వృద్ధి సాధించాలో ఆయన తన అంచనాలను వెల్లడించారు. ‘జనాభా అవసరాలు తీర్చాలన్నా.. కొత్త ఉద్యోగాలు సృష్టించాలన్నా భారతదేశం 8-8.5 శాతం ఆర్థికవృద్ధి సాధించాలి. ఉత్పాదకతలో చైనా, వియత్నాం వంటి దేశాలతో పోటీ పడాలి. అందుకు అవసరమయ్యే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి. ఐఫోన్ వంటి ప్రతిష్టాత్మక ఉత్పత్తులను దేశంలో తయారు చేస్తున్నారు. కానీ వీటి విడిభాగాలు తయారీలో దేశం పురోగతి చెందింది. అయితే పూర్తి స్థాయి సామర్థ్యాలను సాధించడంలో మాత్రం ఇంకా వృద్ధి చెందాలి’ అని రఘురామ్‌రాజన్ అన్నారు. ప్రపంచ బ్యాంక్ సీనియర్ ఆర్థికవేత్త ధ్రువ్ శర్మ ఇటీవల మాట్లాడుతూ 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే దాదాపు ఏటా 8 శాతం ఆర్థికవృద్ధి నమోదు చేయాలని సూచించిన విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉంటేనే అది సాధ్యమవుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం చేస్తున్న వ్యయం, ఇతర నియంత్రణ చర్యల వల్ల కొవిడ్ తర్వాత దేశం స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తోంది. ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థల కంటే మెరుగైన పనితీరు కనబరుస్తున్నప్పటికీ, ఏటా ఉద్యోగాలు కల్పించడంలో మాత్రం సవాళ్లు ఎదుర్కొంటునట్లు నిపుణులు చెబుతున్నారు. నిరుద్యోగిత రేటు అక్టోబర్‌లో 10.05 శాతానికి చేరుకుందని ముంబైలోని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నివేదిక తెలిపింది. రాబోయే దశాబ్దంలో దేశంలో ఏడు కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టించాలని హెచ్ఎస్బీసీ సూచిస్తుంది. -
ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త..భారీగా ఉద్యోగ నియామకాలు
-
స్టేడియంలో కానిస్టేబుల్ రాతపరీక్ష.. నిరుద్యోగానికి నిదర్శనం!
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో నిరుద్యోగ సమస్యకు నిదర్శనమీ చిత్రం. 1,667 పోలీసు కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం రాజధాని ఇస్లామాబాద్‌లోని ఓ స్టేడియంలో రాత పరీక్ష జరిగింది. ఏకంగా 32,000 మంది అభ్యర్థులు తరలివచ్చారు. అప్పుల కారణంగా ఖర్చును భరించే పరిస్థితి లేక అధికారులు అందరినీ ఒకేచోటుకి పిలిపించి పరీక్ష నిర్వహించారు. పాకిస్తాన్ యువతలో 31 శాతం మంది నిరుద్యోగులే ఉన్నారు. ఇస్లామాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 30వేల మంది పురుష, మహిళ అభ్యర్థులు స్టేడియంలో నేలపైనే కూర్చుని పరీక్ష రాశారు. గత ఐదేళ్లుగా సుమారు 1,667 పోస్టులు ఖాళీగా ఉండగా.. ఇటీవలే భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. పోలీసు నియామక పరీక్షలకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో దేశంలోని నిరుద్యోగ పరిస్థితిపై చర్చ మొదలైంది. దేశంలో నిరుద్యోగ సమస్య గరిష్ఠస్థాయికి చేరుకుంది. పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవెలప్మెంట్ ఎకనామిక్స్(పీఐడీఈ) ప్రకారం దేశంలో 31 శాతం మంది యువత ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అందులో 51 శఆతం మంది మహిళలు, 16 శాతం మంది పురుషులు ప్రొఫెషనల్ డిగ్రీలు చేసి ఖాళీగా ఉన్నారు. పాకిస్థాన్ జనాభాలో 60 శాతం మంది 30 ఏళ్లలోపు వారే ఉండగా.. నిరుద్యోగ రేటు 6.9 శాతంగా ఉంది. ఇదీ చదవండి: ప్రమాదకరంగా పైపైకి -
దేశంలో తగ్గిన నిరుద్యోగం
న్యూఢిల్లీ: నిరుద్యోగం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జూలై నుంచి సెప్టెంబర్ వరకు)లో నిరుద్యోగ రేటు 7.2 శాతంగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నిరుద్యోగం 9.8 శాతంగా ఉండడం గమనార్హం. నాడు కరోనా తీవ్రత అధికంగా ఉండడం ఉపాధి అవకాశాలపై ప్రభావం చూపించింది. 15 ఏళ్లు నిండి, అర్హతలుండీ పనిలేని వారిని ఈ గణాంకాలకు పరిగణనలోకి తీసుకుంటారు. కరోనా ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ బయటపడడం, క్రమంగా పురోగతి చూపిస్తున్న క్రమంలో నిరుద్యోగ రేటు తగ్గుతూ వస్తోంది. 16వ పీరియాడిక్ లేబర్ సర్వే వివరాలను జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) గురువారం విడుదల చేసింది. ► జూలై–సెప్టెంబర్ మధ్య పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 7.6 శాతంగా ఉంది. ► పట్టణ మహిళల్లో ఇది 9.4 శాతంగా ఉంది. ఏడాది క్రితం ఇదే కాలంలో పట్టణాల్లో మహిళా నిరుద్యోగ రేటు 11.6 శాతంగా ఉండడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఇది 9.5 శాతంగా ఉంది. ► ఇక పట్టణ ప్రాంతాల్లోని పురుషుల్లో నిరుద్యోగం 6.6 శాతంగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 9.3 శాతంగా ఉండడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో ఇది 7.1 శాతంగా ఉంది. ► 2017 ఏప్రిల్ నుంచి ఎన్ఎస్వో ప్రతి మూడు నెలల కాలానికి సంబంధించి నిరుద్యోగం వివరాలను విడుదల చేస్తోంది. -
Gujarat Assembly Election 2022: మోదీ నుంచి మోర్బీ వరకు...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు నెలకొంది. తొలిసారిగా ఎన్నికల్లో ముక్కోణపు పోటీ జరుగుతూ ఉండడంతో ప్రతీ అంశమూ ఎన్నికల చుట్టూనే తిరుగుతోంది. ముఖ్యంగా అధికార బీజేపీ ఎదుర్కోవాల్సిన సవాళ్లు ఆ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అధిక ధరలు, నిరుద్యోగం దగ్గర్నుంచి ఇటీవల జరిగిన మోర్బీ కేబుల్ వంతెన దుర్ఘటన వరకు ఎన్నో అంశాలు ఈ ఎన్నికలపై ప్రభావాన్ని చూపించనున్నాయి. అవేంటో చూద్దాం.. అధికార వ్యతిరేకత రాష్ట్రంలో 1998 నుంచి అంటే 24 ఏళ్లుగా కొనసాగుతున్న బీజేపీ ప్రభుత్వంపై అధికార వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వంపై వివిధ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. పెరిగిపోతున్న ధరలు, నిరుద్యోగం, తడిసిమోపెడైన జీవన వ్యయం, నాసిరకమైన రోడ్లు, విద్య, ఆరోగ్య రంగాల్లో నాణ్యతా ప్రమాణాలు పడిపోవడం వంటివన్నీ ఈ సారి ఎన్నికల్లో ఓటర్లపై పడనున్నాయి. రాష్ట్ర ప్రజలు మార్పుని కోరుకుంటున్నారనే విశ్లేషణలు వినబడుతున్నాయి. మోదీ ఇమేజ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్ ఈ ఎన్నికల్లో అత్యంత కీలక అంశం కానుంది. మోదీ రాష్ట్రాన్ని విడిచిపెట్టి ఎనిమిదేళ్లవుతున్నప్పటికీ ప్రజల్లో ఆయనకున్న ఛరిష్మా తగ్గలేదు. 2001 నుంచి 2014 వరకు ఆయన రాష్ట్రాన్ని నడిపించిన తీరు, అంతర్జాతీయంగా మోదీకి ఉన్న పేరు ప్రతిష్టలు గుజరాత్ ఎన్నికలపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ గుజరాత్ మనం తయారు చేసుకున్నదే అంటూ మోదీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గుజరాత్ మోడల్‌నే అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేస్తామని చెబుతూ ఉండడం గమనార్హం. బిల్కిస్ బానో దోషుల విడుదల గుజరాత్ మత ఘర్షణల సమయంలో జరిగిన బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ దోషులను శిక్షా కాలం కంటే ముందుగానే విడిచిపెట్టడం రాష్ట్రంలో కలకలం సృష్టించింది. ముస్లిం వర్గంపై దీని ప్రభావం అత్యధికంగా ఉంది. 6.5 కోట్లున్న గుజరాత్ జనాభాలో ముస్లింలు 11% ఉన్నారు. 25 అసెంబ్లీ స్థానాల్లో వీరు ప్రభావం చూపించగలరు. బిల్కిస్ బానోకి న్యాయం జరగాలని వీరు చేస్తున్న ఆందోళనలు ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్న చర్చ జరుగుతోంది. కరెంట్ కష్టాలు దేశంలో కరెంట్ చార్జీలు అత్యంత ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఇది. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉన్నప్పటికీ నెల తిరిగేసరికల్లా వచ్చే బిల్లుని చూసి సామాన్యులు గుడ్లు తేలేస్తున్నారు. ఇక కమర్షియల్ విద్యుత్ టారిఫ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. పరిశ్రమలకిచ్చే కరెంట్ చార్జీలు ఇతర రాష్ట్రాల్లో యూనిట్‌కి రూ.4 ఉంటే గుజరాత్లో ఏకంగా రూ.7.50గా ఉండడంతో వాణిజ్యవేత్తల్లో కూడా అసంతృప్తి నెలకొంది. ఆప్, కాంగ్రెస్ గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీలు ఇచ్చారు. రైతు సమస్యలు గుజరాత్ రాష్ట్రాన్ని గత రెండేళ్లుగా వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. పంట నీటిపాలై రైతులకు కడగండ్లే మిగులుతున్నాయి. అయినప్పటికీ వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్టపరిహారం అందడం లేదు. ఇక అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో రైతుల దగ్గర్నుంచి ప్రభుత్వం భారీగా భూముల్ని సేకరించింది. అహ్మదాబాద్, ముంబై బుల్లెట్ రైలు ప్రాజెక్టు, వడోదర, ముంబై ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టు కోసం చేసిన భూ సేకరణ వివాదాస్పదమైంది. పేపర్ లీక్స్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్ష పేపర్ల లీకేజీ యువతలో తీవ్ర అసంతృప్తిని రాజేసింది. తరచుగా పేపర్స్ లీక్ కావడం పరీక్షలు వాయిదా పడడం నిరుద్యోగుల ఆశల్ని అడియాసలు చేస్తోంది. గత ఏడేళ్ల కాలంలో ఎనిమిది సార్లు వివిధ పరీక్షలకు సంబంధించిన పేపర్లు లీకయ్యాయి. మోర్బీ వంతెన దుర్ఘటన సౌరాష్ట్ర ప్రాంతంలోని మోర్బీ కేబుల్ బ్రిడ్జి అక్టోబర్ 30న కుప్పకూలిపోయి 135 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన కూడా ఈ సారి ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారింది. కాంట్రాక్టులు, స్థానిక ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరగడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. బీజేపీ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకి బదులుగా ప్రమాద సమయంలో నదిలోకి దూకి ప్రాణాలను కాపాడిన మాజీ ఎమ్మెల్యే కాంతి అమృతియకు టికెట్ ఇవ్వడం చూస్తేనే దీని ప్రభావం ఎంత ఉందనేది అర్థమవుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నిరుద్యోగులు చనిపోతుంటే కేసీఆర్‌లో చలనమేదీ?
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ బిడ్డ కవిత నిజామాబాద్ ఎంపీగా ఎన్నికల్లో ఒక్కసారి ఓడితేనే ఆయన గుండె తల్లడిల్లిపోయిందని.. మరి అదే గుండె నిరుద్యోగులు చనిపోతే ఎందుకు చలించట్లేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల నిలదీశారు. శనివారం ఆమె ట్విట్టర్ వేదికగా కేసీఆర్ వైఖరిని ఎండగట్టారు. ఒక్కసారి ఓడిపోయినందుకే బిడ్డకు రెండుసార్లు ఎమ్మెల్సీ పట్టం కట్టిన కేసీఆర్.. ఇప్పుడు మంత్రి పదవి కట్టబెట్టేందుకు రెడీగా ఉన్నారని విమర్శించారు. కానీ నోటిఫికేషన్లు లేక, ఉద్యోగాలు రాక ఎంతో మంది నిరుద్యోగులు బలవంతంగా చనువు చాలిస్తున్నా ఏ మాత్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క నెలలోనే ఆరుగురు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నా ఉద్యోగాలు భర్తీ చేయాలన్న సోయి కేసీఆర్‌కు లేకుండాపోయిందన్నారు. నిరుద్యోగులను బలితీసుకుంటున్న హంతకుడు కేసీఆర్ అని షర్మిల దుయ్యబట్టారు. -
తల్లిదండ్రుల మీద బతికేటోళ్లకు బంపరాఫర్
తల్లిదండ్రులకు పిల్లలు భారమా?.. ఓ వయసుకి వచ్చేసరికి పిల్లలు తమ కాళ్ల మీద తాము బతకాలని ప్రతీ తల్లీతండ్రి కొరుకుంటారు. కానీ, ఆ వయసు దాటిన తర్వాత కూడా గడపదాటకుండా ఇంకా తల్లిదండ్రుల మీదే ఆధారపడి బతుకుతుంటారు కొందరు. కారణాలు ఏవైనా.. ఈ కల్చర్‌ను తగ్గించేందుకు నాలుగున్నర కోట్లకు పైగా జనాభా ఉన్న స్పెయిన్ ఓ కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా.. దూరంగా బతికే పిల్లలకు నెలకు 250 పౌండ్లు ప్రభుత్వమే చెల్లించనున్నట్లు ప్రకటించింది. స్పెయిన్ ప్రధాని పెడ్రో సాన్షెజ్(49) స్వయంగా జాతిని ఉద్దేశించి మంగళవారం ఈ ప్రకటన చేశారు. 18 నుంచి 35 ఏళ్ల వయసులోపు పిల్లలు.. పేరెంట్స్‌కు దూరంగా, విడిగా ఉంటే నెలకు 250 పౌండ్లు(290 డాలర్లు.. మన కరెన్సీలో 21 వేల రూపాయలకు పైనే) ఇస్తామని ప్రకటించారాయన. అయితే ఇందుకు కొన్ని కండిషన్ కూడా పెట్టారు. కేవలం దూరంగా ఉండడం మాత్రమే కాదు.. ఏదైనా పని చేసుకుంటూ ఉంటేనే ఈ అమౌంట్ ఇస్తారట. అందులో ఏడాదికి 23 వేల పౌండ్లు సంపాదిస్తేనే.. ఈ బంపరాఫర్ వర్తిస్తుందని ప్రకటించారాయన. పైగా ప్రభుత్వం ఇచ్చే ఆ 250 పౌండ్లను అద్దె కోసమే ఖర్చు చేయాలని, అదీ రెండేళ్లపాటు ఇవ్వనున్నట్లు స్పెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. స్పెయిన్‌లో గత కొన్నేళ్లుగా నిరక్షరాస్యత, నిరుద్యోగం రేటు పెరిగిపోతోంది. ఉద్యోగాలు లేక బద్ధకంగా మారిపోతోంది యువత. దీంతో 30 పడిలో పడ్డా కూడా ఇంకా తల్లిదండ్రుల మీదే ఆధారపడి బతుకుతున్నారు. విశేషం ఏంటంటే.. సంపాదించే స్తోమత ఉన్నవాళ్లు సైతం అద్దెను తప్పించుకునేందుకు తమ భార్యాపిల్లలతో తల్లిదండ్రుల ఇళ్లలోకి చేరిపోతున్నారు. మరోవైపు కరోనా ప్రభావంతో చాలా మంది ఉద్యోగాలు పొగొట్టుకున్నారు. ఉద్యోగాలు చేసేవాళ్లు సైతం అద్దెను మిగిల్చుకునేందుకు ఇలా తల్లిదండ్రుల పంచన చేరుతున్నారు. సొంత ఇళ్ల కొనుగోళ్ల సంగతి సరేసరి. ఈ కారణాలతో ‘ఇళ్ల మార్కెట్’ సైతం దారుణంగా పడిపోయింది. ఈ పరిస్థితి ఒక్క స్పెయిన్లోనేకాదు.. ఇటలీ, గ్రీస్ ఇలా దాదాపు ఈయూ దేశాల్లో ఇలాంటి సినారియోనే కనిపిస్తోంది. అందుకే స్పెయిన్ ప్రధాని పెడ్రో ‘హౌజింగ్ ప్లాన్’ రూపొందించి.. ఇలా ఆఫర్ల ద్వారా ఆకట్టుకుని హౌజ్ మార్కెటింగ్ ఆదాయం పెంచుకునేందుకు, యువతకు పట్టిన బద్ధకాన్ని వదిలించేందుకు ప్రయత్నిస్తున్నారు. చదవండి: పోర్న్ వీడియోలు.. న్యాయం చేయమంటే ఇలాంటి తీర్పు ఇచ్చారేంటి? -
హెచ్1బీతో అమెరికన్లకు నష్టం లేదు!
వాషింగ్టన్: హెచ్–1బీ వీసాల వల్ల అమెరికన్లకు జరిగే నష్టం లేదని తాజా పరిశోధన ఒకటి స్పష్టం చేసింది. ఈ రకమైన వీసాలున్న విదేశీ ఉద్యోగులు ఉండటం ఉపాధి అవకాశాలను పెంచుతాయని పరిశోధన తెలిపింది. అమెరికా కంపెనీలు విదేశీ ఉద్యోగులతో పని చేయించుకునేందుకు హెచ్–1బీ వీసాలు వీలు కల్పిస్తాయన్నది తెలిసిందే. విదేశీ ఉద్యోగులు.. అమెరికన్ల ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తున్నారని ట్రంప్ ప్రభుత్వం భావిస్తూండగా.. ఇందుకు హేతువు లేదని పరిశోధన చెబుతోంది. హెచ్1బీ వీసాదారుల వల్ల నిరుద్యోగ సమస్య తక్కువగా ఉంటున్నట్లు తెలుస్తోందని ఈ పరిశోధనను నిర్వహించిన నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ తెలిపింది. -
30న కాంగ్రెస్ ‘భారత్ బచావో’ ర్యాలీ
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు ముగిశాక తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోని ఎన్డీయే అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై భారీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇందులోభాగంగా ఈ నెల 30న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ‘భారత్ బచావో ర్యాలీ’ని చేపట్టనుంది. దేశంలో ఆర్థిక మందగమనం, నిరుద్యోగం, జీఎస్టీ అమలులో వైఫల్యాలు, ఎన్డీయే సర్కారు ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ ర్యాలీ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. శనివారం ఢిల్లీలోని వార్‌రూమ్‌లో ఏఐసీసీ కీలక సమావేశాన్ని ఏర్పాటుచేసింది. వర్కింగ్ కమిటీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ లీడర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 5 నుంచి 15 వరకు కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలపైనా చర్చించారు. ఆందోళనలకు శ్రీకారం చుట్టని రాష్ట్రాల్లో ఆందోళనలను 25 తేదీలోగా పూర్తి చేయాలని పార్టీ ఆదేశాలిచ్చింది. ఈ నెల 30న ఢిల్లీలో ‘భారత్ బచావో ర్యాలీ’ చేపట్టాలని నిర్ణయించింది. ఈ ర్యాలీకి దేశంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 10 మంది చొప్పున కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చింది. తెలంగాణ నుంచి రాష్ట్ర ఇన్చార్జ్ కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్, అసెంబ్లీలో కాంగ్రెస్‌పక్ష నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్‡రెడ్డి, సంపత్‌కుమార్, ఏపీ నుంచి ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి 1200 మందిని తరలించేలా ఏర్పాట్లు చేయనున్నట్టు ఉత్తమ్ తెలిపారు. ఈ భేటీలో పీసీసీ అధ్యక్షుడి మార్పుపై ఎలాంటి చర్చ జరగలేదని కుంతియా ఒక ప్రశ్నకు బదులిచ్చారు. -
‘కల్లు గీత’పై ‘రియల్’ వేటు!
సాక్షి, హుస్నాబాద్: పట్టణాలు పెద్ద ఎత్తున విస్తరిస్తుండటంతో రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది. దీంతో పట్టణాల శివారుల్లోని బీడు భూములకు అధిక ధరలు చెల్లించి మరీ కొనుగోలు చేస్తున్నారు. వీటితో పాటు తాటి వనాలు ఉన్న భూములను కొనుగోలు చేయడంతో ఆయా గ్రామాల ‘కల్లు గీత’ కార్మికుల పై రియల్ కత్తి వేటు పడుతోంది. కొనుగోలు చేసిన వ్యాపారులు తాటి చెట్లను తొలగించేందుకు ప్రయత్నాలు చేయడంతో కల్లు గీత కార్మికులు ప్రతిఘటిస్తున్నారు. పగటిపూట చెట్లను నరికితే అడ్డొస్తున్నారని రాత్రి వేళల్లో అధునాతన మిషన్లతో పది నిమిషాల్లో కల్లు పారే ఒక్కో చెట్టును నేల కూల్చుతున్నారు. దీంతో వందల మంది గీత కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నారు. హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. దీంతో రియల్ వ్యాపారులు చుట్టు పక్కల గ్రామాల్లోని భూములను కొనుగోలు చేస్తున్నారు. పట్టణ శివారు గ్రామాలైన పందిల్ల , తోటపల్లి తాటి వనంలో వేల సంఖ్యలో తాటి చెట్లు ఉండటంతో ఇక్కడ వందలాది గీత కార్మిక కుటుంబాలు కల్లు గీతపై జీవనం సాగిస్తున్నాయి. ఒక్కొక్క కార్మికుడు సీజన్లో రోజుకు వేయి రూపాలయల కల్లు విక్రయిస్తుంటారు. ఇతర గ్రామాల నుంచి కూడ ఇక్కడకి కల్లు గీయడానికి వస్తుంటారు. హుస్నాబాద్, సిద్దపేట కేంద్రం రోడ్డులో ఉన్న తాటి వనంపై రియల్ వ్యాపారుల కన్ను పడింది. ఆ భూములను కొనుగోలు చేసిన వారు సాగు పేరు చెప్పి తాటి చెట్లను తొలగించి పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులకు ముడుపులు.. ఏ రైతు భూమిలో తాటి చెట్లు ఉన్నా.. వాటికి కల్లు గీసే హక్కు గీతా కార్మికులకు ఉంటుంది. తాటి చెట్టు కల్లు గీసినందుకు చెట్టుకు సొసైటీల ద్వారా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కల్లు పారే చెట్లను నరికేందుకు ఎట్టి పరిస్థితిలో అనుమతులు ఇవ్వకూడదు. ఒక వేల భూ యాజమాని చెట్లను కొట్టాలని ప్రభుత్వ అధికారులకు దరఖాస్తులు పెట్టినా అనుమతి ఇచ్చే ముందు ఎక్సైయిజ్ అధికారుల నుంచి కల్లు పారుతుందా..? లేదా..? అనే విషయం తెలుసుకుంటారు. సంబంధిత అధికారులు భూ యాజమానులు ఇచ్చిన ముడపులకు ఆశపడి అక్రమంగా అనుమతులు ఇస్తున్నారని గీత కార్మికులు ఆరోపిస్తున్నారు. పందిల్ల తాటి వనంలో 32 రెండు చెట్లను తొలగించుటకు అధికారులు అనుమతులు ఇవ్వడంతో రాత్రి రాత్రికే మిషన్లు తెచ్చి తొలగించి కార్మికుల పొట్ట కొట్టారు. చెట్టుకు పరిహారం .... గీత కార్మికులకు ఉపాధినిచ్చే తాటి చెట్లు కూలిపోతే వాటికి ఎక్సైయిజ్శాఖ నుంచి పరిహారంను గీతా కార్మిక సొసైటీలకు అందిస్తారు. ఒక్కొక్క చెట్టుకు రూ.1,960లు చెల్లించగా ఇందులో 50శాతం భూ యాజమానికి, 50శాతం గీతా కార్మిక సొసైటీకి అందించడం జరుగుతుంది. అయితే ఇది ప్రకృతి వైపర్యాల వల్ల కూలిపోయిన చెట్లకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాల్సి ఉంది. అధికారులు మాత్రం యాజమానులకు చెట్లు నరికేందుకు అడ్డదారిలో అనుమతులు ఇచ్చి పరిహారం ఇస్తామని కార్మికులను బుజ్జగిస్తున్నారు. రోజుకు రూ.500 కల్లు అమ్ముకునే కార్మికునికి రూ.930లు ఇస్తే ఏట్లా సరిపోతుందని వారు ప్రశ్నిస్తున్నారు. అక్రమంగా అనుమతులు ఇవ్వడంతో భూ యాజమానులకు ఇచ్చే పరిహారంను కూడ అధికారులు కాజేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. హరితహారం మాటే లేదు..... ప్రభుత్వం గీతా కార్మికులకు ఉపాధి కల్పించుటకు హరితహారంలో తాటి, ఈత, ఖర్జుర చెట్లను పెంచాలని ఎక్సైయిజ్ అధికారులచేత మొక్కలు నాటించి వాటిని సంరక్షణకు చర్యలు తీసుకుంటోంది. హుస్నాబాద్ ఎక్సైయిజ్ అధికారులు మాత్రం ఆ మొక్కలు పెంచడం పక్కన పెట్టి కల్లు పారే తాటి చెట్ల నరికివేసేందుకు అడ్డదారుల్లో అనుమతులు ఇస్తున్నారని బాధిత గీతా కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకు హరిత హారంలో మొక్కలు నాటిన ఎక్సైయిజ్ అధికారులు వాటిని రక్షించుటకు ఎప్పుడు చర్యలు తీసుకోనే లేదు. ప్రతి ఏటా హారితహారం మొక్కలు నాటడం వాటిని వదిలేయడం. పరిహారం పెంచాలి తాటి చెట్టును నమ్ముకొని బతికే కుటుంబాలు వందల సంఖ్యలో ఉన్నాయి. మా పందిల్ల గ్రామంలోనే 86 కుటుంబాలు ఈ వృత్తి మీదనే ఆధారపడి ఉన్నాయి. పొరుగు గ్రామాల కార్మికులు సైతం వచ్చి కల్లు గీతా వృత్తిలో జీవిస్తున్నారు. రాత్రి వేళలో వచ్చిన చెట్లను నరకడం వల్ల కార్మికులు ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు. ఒక్కొక్క చెట్టుకు రూ. 10 వేల పరిహారం ఇవ్వాలి. మల్లన్నసాగర్లో తాటి చెట్లు పోయిన కార్మికులకు ఇచ్చినట్లు మా గ్రామ గీత కార్మికులకు కూడా ఇవ్వాలి. అధికారుల నిర్లక్ష్యం వల్లే తాటి వనాలు నరికేస్తున్నారు. ఒకరిపై కేసులు నమోదు చేస్తే మరెప్పుడు తాటి చెట్లను నరికేందుకు భయపడుతారు. –తోడేటి రమేశ్, సర్పంచ్ పందిల్ల -
భారత్‌ను కలవరపెడుతున్నవి ఆ రెండే..
సాక్షి, న్యూఢిల్లీ : నిరుద్యోగం, ధరల పెరుగుదలే దేశాన్ని తీవ్రంగా కలవరపెడుతున్న అంశాలని తాజా సర్వే వెల్లడించింది. ఉగ్రవాదాన్ని దీటుగా ఎదుర్కోవడంతో పాటు దేశంలోని ప్రధాన సమస్యలను మోదీ సర్కార్ డీల్ చేసే తీరుపై ప్రజల్లో నిరాశే నెలకొందని అమెరికాకు చెందిన పీఈడబ్ల్యూ రీసెర్చి సెంటర్ ఇటీవల ప్రచురించిన సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేను గత ఏడాది మే-జులైలో నిర్వహించగా, సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఏడాది మార్చిలో సర్వేను ప్రచురించారు. భారత ఓటర్లను అధికంగా ఆందోళనకు గురిచేస్తున్నదని నిరుద్యోగం, ధరల పెరుగుదలేనని ఈ సర్వే తేల్చింది. అధికారుల్లో పేరుకుపోయిన అవినీతి, ఉగ్రవాదం, నేరాలు సైతం భారత ఓటర్లను కలవరపెడుతున్నాయని పేర్కొంది. పది ఆందోళన కలిగించే అంశాల్లో పారిశ్రామికవేత్తల్లో అవినీతి, వాయుకాలుష్యం కూడా చోటుచేసుకున్నాయి. రెండోసారి అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న మోదీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి గూడుకట్టుకుందని ఈ సర్వే వెల్లడించడం గమనార్హం. ముఖ్యంగా మోదీ హయాంలో నిరుద్యోగ భారతంలో ఎలాంటి మార్పు లేకపోవడం, కొత్త కొలువులు పెద్దగా రాకపోవడం పట్ల యువత ఆగ్రహంగా ఉన్నట్టు సర్వే నివేదిక పెదవివిరిచింది. ఇక ధరల పెరుగుదలతో జీవితం దుర్భరంగా మారిందని సర్వేలో పాల్గొన్న వారిలో 65 శాతం మంది ఆందోళన వ్యక్తం చేయగా, అవినీతి పెరిగిందని 65 శాతం మంది అభిప్రాయపడ్డారు. మరోవైపు ఉగ్రవాదాన్ని సమర్ధంగా ఎదుర్కొంటున్నామని మోదీ సర్కార్ చాటిచెబుతుండగా, ఉగ్రవాదం మరింత పెచ్చుమీరిందని 59 శాతం మంది చెప్పుకొచ్చారు. ఉగ్రవాదాన్ని దీటుగా ఎదుర్కొంటున్నారని కేవలం 21 శాతం మందే అభిప్రాయపడ్డారు. కాగా, భారత్‌లో 20 ఏళ్ల కిందటి పరిస్థితితో పోలిస్తే ప్రస్తుతం సగటు జీవి ఆర్థిక పరిస్థితి మెరుగైందని 65 శాతం మంది చెప్పడం గమనార్హం. ఆర్థికంగా సగటు జీవి చితికిపోయాడని కేవలం 15 శాతం మందే వెల్లడించారు. ఇక భారత్‌లో ప్రజాస్వామ్యం పనితీరుపై 54 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే 2017లో 79 శాతం మంది ప్రజాస్వామ్య తీరుపై సంతృప్తి వ్యక్తం చేయగా, ఇప్పుడు వారి సంఖ్య గణనీయంగా తగ్గడం గమనార్హం. -
నిరుద్యోగం, ఉగ్రవాదమే అసలు సవాళ్లు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ముంగిట దేశ ప్రజలు నిరుద్యోగం, ఉగ్రవాదంపైనే ఎక్కువగా ఆందోళన చెందుతున్నట్లు తాజా సర్వేలో తేలింది. దేశం ముందుకు సాగుతున్న తీరుపై చాలా మంది ఆశావహ దృక్పథంతోనే ఉన్నట్లు తేలింది. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ప్యూ రీసెర్చ్ సెంటర్ ఈ అధ్యయనం చేపట్టింది. ఉగ్రవాదం, పాక్ నుంచి ముప్పుపై ఎక్కువ శాతం మంది భయాందోళనలు వ్యక్తం చేశారు. 20 ఏళ్లతో పోలిస్తే ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ చాలా మెరుగ్గా ఉందని సుమారు 65 శాతం మంది అభిప్రాయపడ్డారు. దేశం ఎదుర్కొంటున్న అత్యంత కఠిన సవాలు నిరుద్యోగమే అని 76 శాతం మంది పేర్కొన్నారు. సర్వే ముఖ్యాంశాలు ► పాక్‌తో భారత్‌కు ముప్పు ఉందని 76 శాతం మంది అభిప్రాయపడ్డారు. కశ్మీర్లో తాజా పరిస్థితి తీవ్రమైన సమస్య అని పేర్కొన్న వారు 55 శాతం మంది. ► కశ్మీర్లో పరిస్థితి దిగజారిందని అభిప్రాయపడిన 53 శాతం మంది. ► కొన్నేళ్లుగా ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉన్నా ధరలు పెరగడం సమస్యగా మారిందని 73 శాతం మంది చెప్పారు. ► అవినీతి అధికారులు(66 శాతం), ఉగ్రవాదం (63 శాతం), నేరాలు(64 శాతం) దేశానికి పెద్ద సమస్యలుగా మారాయని పేర్కొన్నారు. ► భారత్‌లో అభద్రతా భావంతో జీవిస్తున్నామని 54 శాతం మంది అభిప్రాయపడ్డారు. ► 2014 నుంచి మత విద్వేష ఘటనలు పెరిగినా, కేవలం 34 శాతం మందే ఇది పెద్ద సమస్య అని పేర్కొన్నారు. ► ఎన్డీయే హయాంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయని 21 శాతం మంది పేర్కొనగా, పరిస్థితి దిగజారిందని 67 శాతం మంది చెప్పారు. ► ధరలు భారీగా పెరిగాయని 65 శాతం మంది, అవినీతి పెచ్చరిల్లుతోందని 65 శాతం మంది, ఉగ్రవాద ఘటనలు పెరిగాయని 59 శాతం మంది అన్నారు. ► ఎన్నికైన ప్రజా ప్రతినిధులు అవినీతిపరులని 69 శాతం పేర్కొనగా, ఎవరు గెలిచినా ఈ పరిస్థితిలో మార్పు రాదని 58 శాతం మంది పౌరులు అభిప్రాయపడ్డారు. ఉద్యోగాలు, ఆరోగ్యానికే ప్రాధాన్యం తర్వాతి స్థానాల్లో తాగునీరు, రోడ్లు ప్రాధాన్యతాంశాలపై ఏడీఆర్ సర్వే న్యూఢిల్లీ: మెరుగైన ఉద్యోగావకాశాలు, ఆరోగ్య సంరక్షణ, సురక్షిత తాగునీరుకే ప్రజలు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) సర్వేలో తేలింది. ఓటరు ప్రాధాన్యతా అంశాల్లో ప్రభుత్వ పనితీరు సగటు కన్నా దిగువనే ఉందని తెలిసింది. ఓటరు ప్రవర్తనను ప్రభావితం చేసే కారకాలు, ఓటరు ప్రాధాన్యతా అంశాలు(10), ప్రభుత్వ పనితీరుకు ప్రజలిచ్చిన రేటింగ్ ప్రాతిపదికగా ఈ సర్వే నిర్వహించారు. మెరుగైన ఉద్యోగ అవకాశాలు ఉండాలని 46.80 శాతం మంది, మెరుగైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు కల్పించాలని 34.60 శాతం మంది, సురక్షిత తాగునీరు కావాలని 28.34 శాతం మంది అభిప్రాయపడ్డారు. తరువాతి స్థానాల్లో మెరుగైన రోడ్లు(28.34 శాతం), లోపరహిత ప్రజా రవాణా వ్యవస్థ(27.35 శాతం) ఉన్నాయి. ఓటర్ల టాప్ 10 ప్రాధాన్యతా అంశాల్లో వ్యవసాయ సంబంధ విషయాలు కూడా ఉన్నాయి. సాగునీరు(26.40 శాతం) ఆరో స్థానంలో, రుణ పరపతి(25.62 శాతం) ఏడో స్థానంలో, పంట ఉత్పత్తులకు మద్దతు ధర(25.41 శాతం) 8వ స్థానంలో, సబ్సిడీలు(25.06 శాతం) 9వ స్థానంలో ఉన్నాయి. మెరుగైన శాంతి భద్రతలకు 10వ స్థానం దక్కింది. -
యువతకు ముందంతా అంధకార బంధురమే!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిపోతోంది. బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటున్న యువతకు ముందంతా అంధకార బంధురమే కనిపిస్తోంది. మొన్నటి మొన్న మహారాష్ట్రలో మూడున్నర వేల మంది రైల్వేలో అప్రెంటీస్లుగా శిక్షణ పొందిన నిరుద్యోగ యువకులు మెట్రో రైళ్ల రాకపోకలను స్తంభింపచేయడం ఈ విషయాన్ని సూచిస్తోంది. రాజస్థాన్ సచివాలయంలో 18 ప్యూన్ ఉద్యోగాల నియామకాలకు పిలుపునిస్తే 129 మంది ఇంజనీర్లు, 23 మంది లాయర్లు, ఓ చార్టెట్ అకౌంటెంట్, 393 మంది పోస్ట్ గ్రాడ్యువేట్లు సహా మొత్తం 12, 453 మంది దరఖాస్తు చేసుకోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఈ జనవరి నెల అంచనాల ప్రకారం దేశంలో నిరుద్యోగ సమస్య 6.1 శాతానికి చేరుకుంది. గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య 2017, మార్చి నెలలో 4.11 ఉండగా ఇప్పుడది 5.65 శాతానికి చేరుకుంది. వ్యవసాయంపై ఎక్కువ అధారపడిన మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో కూడా 3.7 శాతానికి చేరుకుంది. వ్యవసాయం పరిస్థితి కూడా సరిగ్గా లేకపోవడంతో ఇటీవలనే 35 వేల మంది నాసిక్ నుంచి ముంబైకి భారీ ర్యాలీ నిర్వహించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా యువతకు ఉద్యోగాలు కల్పించడం తన ప్రాథామ్యాల్లో ఒక్కటని చెప్పుకుంది. ఏడాదికి రెండున్నర కోట్ల ఉద్యోగాల చొప్పున పదేళ్లలో 25 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తానని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో అంటే, 2015లో 1.55 లక్షలు, 2016లో 2.31 లక్షలు, 2017లో 4.16 లక్షల ఉద్యోగాల నియామకాలు జరిగాయి. పదేళ్లలో 25 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానన్న మాట ఇచ్చిన నరేంద్ర మోదీ నాలుగేళ్ల కాలంలో పది కోట్ల ఉద్యోగాలు కల్పించాల్సి ఉంది, అందులో పది లక్షల ఉద్యోగాలు కూడా కల్పించలేక పోయారు. 2018లో ఆరు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించవచ్చని ఆయన ప్రభుత్వమే ఇటీవల అంచనాలు వేసి చెప్పింది. ఏటా పుట్టుకొచ్చే నిరుద్యోగుల్లో ఈ ఉద్యోగాల సంఖ్య ఎంత? -
హార్న్ ఆఫ్ ఆఫ్రికా
జిబౌటి హార్న్ ఆఫ్ ఆఫ్రికా దేశాలలో ఒకటి... జిబౌటి. ఈ దేశానికి ఉత్తరంలో ఎరిట్రియా, దక్షిణంలో ఇథియోపియా, ఆగ్నేయంలో సోమాలియా దేశాలు ఉన్నాయి. సుదీర్ఘకాలం పాటు ఫ్రెంచ్ పాలనలో ఉంది జిబౌటి. 1966 ఆగస్ట్‌లో ఫ్రెంచ్ అధ్యక్షుడు చార్లెస్ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు స్వాతంత్య్రం కావాలంటూ నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. ‘ఫ్రెంచ్ అధీనంలో ఉంటారా? స్వాతంత్య్రం కావాలా?’ అనే అంశంపై ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ లూయిస్ సాగెట్ రెఫరెండం నిర్వహించారు. 60 శాతం మంది ఫ్రెంచ్ పాలనలోనే ఉండడానికి మొగ్గు చూపారు. అయితే కథ ఇక్కడితో ముగిసిపోలేదు. నిరసనలు ఆగలేదు. స్వాతంత్య్రకాంక్ష ఏదో ఒక ఉద్యమ రూపంలో వ్యక్తమవుతూనే ఉండేది. ఎట్టకేలకు 1977లో ఫ్రెంచ్ పాలన నుంచి స్వాతంత్య్రం పొందింది జిబౌటి. ఒకవైపు స్వాతంత్య్ర సంబరాలు, మరోవైపు ‘ఈ చిన్న దేశం... అంతర్యుద్ధాలతో కుప్పకూలిపోవడం ఖాయం. దేశానికి భవిష్యత్ లేదు’ అనే జోస్యాలు మొదలయ్యాయి. దేశంలోని నాన్ సోమాలి అఫార్స్-సోమాలి ఇస్సాస్ మధ్య ఉన్న విభేదాలు... దేశప్రగతికి అడ్డుపడతాయనే అంచనా ఉండేది. అయితే స్వాతంత్య్రానంతరం ఈ రెండు వర్గాల మధ్య ‘అధికార మార్పిడి’ ఫార్ములా విజయవంతంగా అమలుకావడంతో... ఆ అనుమానాలు, అంచనాలేవీ నిజం కాలేదు. 1991లో దేశంలో అంతర్యుద్ధ పరిస్థితులు ఏర్పడినప్పటికీ ఆ తరువాత జరిగిన చర్చలతో శాంతియుత వాతావరణం ఏర్పడింది. పరిపాలనపరంగా జిబౌటి ఆరు విభాగాలుగా విభజించబడింది. వీటిని 11 జిల్లాలుగా విభజించారు. 820 రకాల మొక్కలు, 360 రకాల పక్షులు, 66 రకాల క్షీరదాలు ఉన్న జిబౌటి జీవవైవిధ్యానికి కొంగుబంగారంగా నిలిచింది. గోడ పర్వతాల్లోని ‘డే ఫారెస్ట్ నేషనల్ పార్క్’ జీవవైవిధ్యానికి మరో కానుక. కళల విషయానికి వస్తే... జిబౌటి సంగీతానికి మంచి ప్రాచుర్యం ఉంది. మొదట్లో ఇతర ప్రాంతాల ప్రభావం ఉన్నప్పటికీ ఆ తరువాత తనదైన శైలితో ప్రత్యేకతను నిలుపుకుంది. జిబౌటి కవిత్వానికి ఘనమైన చరిత్ర ఉంది. వంద పంక్తుల కవిత ‘గబె’కు జిబౌటి సాహిత్యంలో ప్రత్యేకత ఉంది. తక్కువ వర్షపాతం వల్ల పండ్లు, కూరగాయలు మాత్రమే పండిస్తారు. వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కువగా దిగుమతి చేసుకుంటారు. అంతర్యుద్ధం తాలూకు ప్రతికూల ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడినప్పటికీ, ఆ తర్వాత రాజకీయ స్థిరత్వం ఏర్పడడంతో పరిస్థితి కుదుటపడింది. స్వాతంత్య్రనంతరం జిబౌటి ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. నిరుద్యోగం, పేదరికం సమస్యలు సవాళ్లుగా నిలిచాయి. ఈ విషయం ఎలా ఉన్నప్పటికీ ‘సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ ఇన్ ది వరల్డ్’ జాబితాలో చోటు చేసుకుంది. టాప్ 10 1. నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉన్న దేశాలలో జిబౌటి ఒకటి. 2. రాజధాని జిబౌటి ఆఫ్రికా ఖండంలోని చిన్న పట్టణాలలో మూడవది. 3. {ఫెంచ్, ఇస్లాం సంప్రదాయం, సంస్కృతుల ప్రభావం భవననిర్మాణ కళలో కనిపిస్తుంది. 4. ఉప్పునీటి సరస్సు లక్ అసల్ ‘ఉప్పు’ ఇంటి అవసరాలకు ఉపయోగపడడమే కాదు వాణిజ్యానికి కూడా ఉపయోగపడుతుంది. 5. జిబౌటిలో మాత్రం క్రిస్మస్ను జనవరి 7న జరుపుకుంటారు. 6. సూర్యోదయం తరువాత ట్యాక్సీ రేట్లు పెరుగుతాయి. 7. మూడింట రెండు వంతుల మంది దేశరాజధానిలోనే నివసిస్తారు. 8. ఫ్రెంచ్, అరబ్బీలతో పాటు సోమాలి, అఫర్లను మాట్లాడతారు. 9. కన్స్ట్రక్షన్, అగ్రికల్చరల్ ప్రాసెసింగ్, సాల్ట్మైనింగ్, పెట్రోలింగ్ రిఫైనరీ... మొదలైనవి దేశంలో ప్రధాన పరిశ్రమలు. 10. దేశంలో అక్షరాస్యత 68 శాతం.