'నీ బాయ్ ఫ్రెండ్కు ఫోన్ చేయ్.. ఫోన్ చేయ్..' | Her Attacker Forced Her To Make A Phone Call During A Rape - So She Called 911 | Sakshi

'నీ బాయ్ ఫ్రెండ్కు ఫోన్ చేయ్.. ఫోన్ చేయ్..'

Dec 31 2015 7:09 PM | Updated on Jul 28 2018 8:53 PM

'నీ బాయ్ ఫ్రెండ్కు ఫోన్ చేయ్.. ఫోన్ చేయ్..' - Sakshi

'నీ బాయ్ ఫ్రెండ్కు ఫోన్ చేయ్.. ఫోన్ చేయ్..'

తన గోతిలో తానే పడ్డట్లు ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి తనంతట తాను పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు.

జార్జియా: తన గోతిలో తానే పడ్డట్లు ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి తనంతట తాను పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. లైంగికదాడికి పాల్పడే క్రమంలో బాధితురాలిని ఆమె బాయ్ ఫ్రెండ్కు ఫోన్ చేయ్.. ఫోన్ చేయ్ అంటూ బెదిరించి దొరికిపోయాడు. ఆ యువతి బాయ్ ఫ్రెండ్ కాకుండా పోలీసుల అత్యవసర ఫోన్ నెంబర్ 911కు చేయడంతో వారు వచ్చి ఆమెను రక్షించారు. అతడిని అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే క్లేటాన్ అనే రాష్ట్రంలో రాబర్డ్ గిల్స్(27) అనే వ్యక్తి ఓ యువతిపై లైంగికదాడికి పాల్పడేందుకు ప్రయత్నించాడు.

అదే సమయంలో ఆమె బాయ్ ఫ్రెండ్కు ఫోన్ చేసి అతడి స్పందన ఎలా ఉంటుందో వినాలని అనుకున్నాడు. అనుకుందే తడవుగా ఫోన్ చేయ్ అతడికి ఫోన్ చేయ్ అంటూ బెదిరించాడు. దీంతో ఆ యువతి తెలివిగా వ్యవహరించి పోలీసుల ఫోన్ నెంబర్ 911కు చేసింది. దీంతో వెంటనే పోలీసులు స్పందించి ఘటన జరుగుతున్న ప్రాంతాన్ని గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువతిపై ఎలాంటి దాడి జరగకుండా అడ్డుకోగలిగారు. ఈ సందర్భంగా ఫోన్ కాల్‌ రిసీవ్ చేసుకొని వేగంగా స్పందించడమే కాకుండా పోలీసులను పంపించేవరకు ఫోన్ ఆపరేటర్ చూపిన చొరవకు అంతా ముగ్దులైపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement