స్కూల్ బాత్రూంలో 25 మందితో..
ఫ్లోరిడా: గుడిలాంటి బడిలో విద్యార్థుల అకృత్యాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఫ్లోరిడాలోని సౌత్ ఫోర్ట్ మియర్స్ హై స్కూల్లో చోటు చేసుకున్న సంఘటన విద్యాలోకం విస్తుపోయేలా చేస్తోంది. 15 ఏళ్ల బాలిక, 25 మంది విద్యార్థులతో సెక్స్లో పాల్గొన్న వీడియో స్కూల్ ప్రాంగణంలో చక్కర్లు కొట్టడంతో విద్యార్థులు, తల్లిదండ్రులందరూ షాక్కు గురయ్యారు.
'క్లాసులు ముగిసిన తర్వాత కొందరు విద్యార్థులు పాఠశాల లోపలికి వచ్చారు. 25 మంది బాలులు ఒకరి తరువాత మరొకరు బాత్ రూంకు లోపలికి వెళ్లి బయటకు రావడం సీసీకెమెరాలో గమనించాం' అని పోలీసులు తెలిపారు. లోపలికి వెళ్లిన తర్వాత చేసిన అఘాయిత్యాన్ని కెమెరాలో చిత్రీకరించారు. దీనికి సంబంధించి వీడియో స్నాప్ చాట్ ద్వారా వైరల్ అయ్యింది. సదరు విద్యార్థిని పలువురు బాలులతో బాత్ రూంలో సెక్స్ చేసినట్టు ప్రిన్సిపాల్ ముందు అంగీకరించింది. దీని వెనుక స్కూల్కు చెందిన ఫుట్ బాల్ ఆటగాళ్ల ప్రమేయముందని సమాచారం.
ఇలాంటి సంఘటనలు స్కూల్లో చోటుచేసుకోవడం దారుణమని పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. వీడియో చిత్రీకరించిన మొబైల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తుకు ఆదేశించినట్టు ప్రిన్సిపాల్ తెలిపారు.