సంబురాల్లో హిల్లరీ
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్కు ప్రత్యర్థిగా హిల్లరీ క్లింటనే నిలవనున్నారు. ఎట్టకేలకు ఆమె డెమొక్రటిక్ పార్టీ తరుపున దాదాపు నామినేషన్ ఖరారు చేసుకోనున్నారు. వర్జిన్ ఐలాండ్లోని నగరాల్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థుల్లో హిల్లరీనే పై చేయి సాధించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎవరెవరు ఎన్నిస్థానాల్లో పై చేయి సాధించారనే విషయం స్పష్టంగా తెలియకున్నా ఆరు చోట్ల మాత్రం హిల్లరీదే పై చేయి అని చెబుతున్నారు.
పోటీలో ఉన్న సాండర్స్ను ఆమె అధిగమించారని.. డెమొక్రటిక్ తరుపున నామినేషన్ వేసే అర్హతకు చేరువలో ఉన్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో తాను అప్పుడే విజయం సాధించినంత సంబరాల్లో హిల్లరీ మునిగిపోయారంట. ఫేస్ బుక్ ద్వారా డెమొక్రటిక్ పార్టీ వెల్లడించిన ఫలితాల్లో వర్జిన్ ఐలాండ్ లోని పెద్ద దీవులైన సెయింట్ క్రాయిక్స్, సెయింట్ థామస్ లో ఆమె పై చేయి సాధించినట్లు స్పష్టం అయింది. మరు నాలుగు చోట్ల కూడా ఆమెనె విజయం వరించిందని చెబుతున్నారు. సెయింట్ క్రాయిక్స్ లో 92శాతం ఓట్లు ఆమెకు రాగా, సెయింట్ థామస్ లో 88 శాతం ఓట్లు వచ్చాయి. కాగా, జూలై నెల వరకు ఎవరు డెమొక్రటిక్ అభ్యర్థిగా వెళతారు ఎదురు చూడాల్సిందే తప్ప ఇప్పుడే ఆఖరు అనుకోవద్దని సాండర్స్ చెప్పాడు.