చరిత్ర సృష్టించిన హిల్లరీ క్లింటన్
వాషింగ్టన్ : మాజీ ప్రథమ మహిళ హిల్లరీ క్లింటన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్తో ఢీ అంటే ఢీ అంటూ సిద్ధం అయ్యారు. దేశాధ్యక్ష ఎన్నికల బరిలో డెమోక్రటిక్ అభ్యర్థిగా ఆమె నామినేషన్ ఖరారైంది. ఈ విషయాన్ని ఏజెన్సీ ప్రెస్, యూఎస్ నెట్ వర్క్స్ వెల్లడించాయి. డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీలో ఉన్న శాండర్స్ను అధిగమించి అధ్యక్ష నామినేషన్ కోసం కావాల్సిన 2383 డెలిగేట్లను హిల్లరీ గెలుచుకున్నారు.
దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్ రేసులో ఓ మహిళ నిలవడం ఇదే ప్రథమం. ప్యూర్టో రికోలో జరిగిన ప్రైమరీలో హిల్లరీ భారీ విజయాన్ని నమోదు చేసుకున్నారు. చివరి నిమిషంలో ఆమెకు సూపర్‌డెలిగేట్ ఓట్లు లభించడంతో ఆమె విజయం సాధించినట్లు ఏజెన్సీ ప్రెస్ ప్రకటించింది. హిల్లరీకి 2,383 శాండర్స్ కు 1,5691 డెలిగేట్లు వచ్చాయి. ఫలితాల అనంతరం ఈ విషయాన్ని హిల్లరీ తన ట్విట్టర్ ద్వారా 'గాట్ ప్రైమరీస్ టూ విన్' అంటూ షేర్ చేసుకున్నారు. కాగా, జూలై నెల వరకు ఎవరు డెమొక్రటిక్ అభ్యర్థిగా వెళతారు ఎదురు చూడాల్సిందే తప్ప ఇప్పుడే ఆఖరు అనుకోవద్దని శాండర్స్ వ్యాఖ్యానించాడు.
We’re flattered, @AP, but we've got primaries to win. CA, MT, NM, ND, NJ, SD, vote tomorrow! https://t.co/8t3GpZqc1U
— Hillary Clinton (@HillaryClinton) 7 June 2016