‘నేను రాజీనామా చేయను’.. ట్రంప్ ఫైర్
న్యూయార్క్: భారతీయ సంతతికి చెందిన అమెరికన్ అటార్నీ ప్రీత్ బరారాపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరిపాలన వర్గం ఫైర్ అయ్యింది. ఉన్నపలంగా తన పదవికి రాజీనామా చేయాలంటూ వచ్చిన ఆదేశాలను ఆయన పట్టించుకోకుండా తాను రాజీనామా చేయబోనని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒబామా పరిపాలన హయాంలో నియమితులైన 46మంది ఫెడరల్ అటార్నీలు ఉన్నపలంగా రాజీనామా చేయాలంటూ ట్రంప్ పరిపాలన వర్గం ఆదేశాలు జారీ చేసింది.
‘నేను రాజీనామా చేయలేదు. దీంతో కొద్ది సేపటికే కిందే ట్రంప్ పాలనా వర్గం నాపై కోప్పడింది. నా వ్యక్తిగత జీవితంలో అమెరికాలోని సౌతర్న్ డిస్ట్రిక్ ఆఫ్ న్యూయార్క్‌కు అటార్నీగా ఉండటం నాకు దక్కిన గొప్ప గౌరవం’ అంటూ ప్రీత్ బరారా తన వ్యక్తిగత ట్విట్టర్ పేజీలో రాసుకొచ్చారు. అమెరికాలోని అవినీతికి వ్యతిరేకంగా చాలా కఠినంగా వ్యవహరించే వాళ్లలో భరారా ఒకరు. వాస్తవానికి నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన తర్వాత ప్రీత్ భరారా ఆయనను కలిసి అభినందనలు తెలిపారంట.
ఆ సమయంలో అటార్నీ పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, మీరు పదవిలో కొనసాగవచ్చని ట్రంప్ ఆయనకు హామీ ఇచ్చారని సమాచారం. అయితే, తాజాగా ఫెడరల్ యాక్టింగ్ అటార్నీలు అంతా కూడా రాజీనామా చేయాలని ఆదేశించడంతో భరారా కార్యాలయం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిందని సమాచారం. తనను ట్రంప్ అధికారంలోనే ఉండమన్నారని రాజీనామా చేసేందుకు నిరాకరించడంతో ట్రంప్ వర్గం ఆయనపై ఫైర్ అవుతున్నట్లు తెలుస్తోంది.