భార్యను హత్య చేసిన ఓ భారతీయ సంతతికి వ్యక్తి జీవితాంతం కటకటాలపాలయ్యాడు. న్యూజిలాండ్లోని ఆక్లాండ్ హై కోర్టు ఈ జీవిత కారాగార శిక్షను విధించింది.
వెల్లింగ్టన్: భార్యను హత్య చేసిన ఓ భారతీయ సంతతికి వ్యక్తి జీవితాంతం కటకటాలపాలయ్యాడు. న్యూజిలాండ్లోని ఆక్లాండ్ హై కోర్టు ఈ జీవిత కారాగార శిక్షను విధించింది. గత ఏడాది మందీప్ సింగ్ అనే 29 ఏళ్ల వ్యక్తి ఆక్లాండ్లోని ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ గ్రూప్ స్కూల్ వద్ద మే 22న తన భార్య పర్మితా రాణి(22)ని హత్య చేయడంతోపాటు పర్మిందర్ సందు అనే మరో వ్యక్తిని హత్య చేసేందుకు ప్రయత్నించాడు.
ఈ కేసుపై గత కొద్ది రోజులుగా విచారణ చేపట్టిన కోర్టు చివరకు జీవిత ఖైదు విధించింది. సందుతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతోనే అతడు తన భార్యను హత్య చేసినట్లు తెలిసింది. ఈ హత్య చేస్తున్న సమయంలో సందు అడ్డు పడగా అతడిని కూడా కత్తితో పొడవడంతో ఊపిరితిత్తులకు గాయాలయ్యాయి.