పాక్ ఎంపీలతో భారత పార్లమెంటరీ బృందం భేటీ | Indian, Pakistan MPs reaffirm faith in talks | Sakshi
Sakshi News home page

పాక్ ఎంపీలతో భారత పార్లమెంటరీ బృందం భేటీ

Published Fri, Sep 20 2013 4:17 AM | Last Updated on Fri, Sep 1 2017 10:51 PM

Indian, Pakistan MPs reaffirm faith in talks

ఇస్లామాబాద్: ఎంపీ మణిశంకర్ అయ్యర్ నేతృత్వంలోని 13 మంది పార్లమెంట్ సభ్యుల ప్రతినిధి బృందం గురువారం పాకిస్థాన్ ఎంపీల బృందంతో సమావేశమైంది. భారత్-పాక్ మలిదశ చర్చలకు సానుకూల వాతావరణం కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వీరు చర్చించారు. భారత ఎంపీల పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మణిశంకర్ అయ్యర్ మాట్లాడారు. ఇరుదేశాల మధ్య చర్చలు జరగాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. నవాజ్‌షరీఫ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టగానే చర్చల దిశగా భారత్ సానుకూల దృక్పథంతో చూసిందని, అయితే ఇటీవలి పరిణామాలు తమ దేశ ప్రజలను నిరాశపరిచాయని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement