
అంతర్జాతీయ మార్కెటింగ్ సదస్సులో ప్రసంగిస్తున్న ఐఎంటి డైరక్టర్ డా..సతీష్ ఐలవాడి..
ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ టెక్నాలజీ (ఐఎంటి), హైదరాబాద్ ఆధ్వర్యంలో రెండురోజులపాటు జరిగిన అంతర్జాతీయ సదస్సు ఈ రోజు ముగిసింది.
హైదరాబాద్: ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ టెక్నాలజీ (ఐఎంటి), హైదరాబాద్ ఆధ్వర్యంలో రెండురోజులపాటు జరిగిన అంతర్జాతీయ సదస్సు ఈ రోజు ముగిసింది. ఫ్రాన్స్ కు చెందిన ఈకోల్ డి మేనేజిమెంట్ డి నార్మండి మరియు హంగేరికి చెందిన కోర్వినస్ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నూతనంగా ఆవిర్భవిస్తున్న మార్కెట్లు - మార్కెటింగ్ సవాళ్లు అనే అంశంపై జరిగిన సదస్సులో దాదాపు 15 పరిశోధనాత్మక పత్రాలను పలువురు మార్కెట్ నిపుణులు ప్రవేశపెట్టారు. నూతనంగా విస్తరిస్తున్న మార్కెట్లలో సవాళ్ళను ఎదుర్కోవడంలో తీసుకోవాల్సిన చర్యలపై పలువురు విద్యావేత్తలు ప్రసంగించారు. ప్రపంచ ఆర్దిక వ్యవస్థలో పెరుగుతున్న మార్కెట్లతొనే ఆర్దిక ప్రగతి సాధ్యమవుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉద్భవిస్తున్న ఆర్ధిక వ్యవస్థను పటిష్టపరిచేందుకు ఉత్పాదకతను పెంచాలని నిపుణులు అభిప్రాయపడ్డారు. సంప్రదాయ ఆర్ధిక వ్యవస్థలనుండి కొత్త ఆర్ధిక విధానానికి దారితీస్తున్న పరిస్థితులను ఆర్ధిక నిపుణులు విశ్లేషించారు. ఐఎంటి డైరక్టర్ డా..సతీష్ ఐలవాడి మాట్లాడుతూ..నూతనంగా ఏర్పడుతున్న మార్కెట్లు భిన్నత్వం, సామాజిక, రాజకీయ పాలన, మౌలికవసతుల లేమి, పారంపర్యంగా ఉన్న వనరుల లోటు, బలహీనమైన సరఫరా వ్యవస్థ వంటి అంశాలు నూతన మార్కెట్లకు సవాళ్లుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. వీటిని ఎదుర్కొనేందుకు కొత్త మార్కెట్ విధానాలను అవలింభించాలని డా..సతీష్ సూచించారు.