లండన్ : కరోనా వైరస్ సోకి ఐసీయూలో చికిత్స పొందుతున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ త్వరగా కోలుకోవాలని అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. మార్చి 27న బోరిస్ జాన్సన్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో స్వీయ నిర్భందంలోకి వెళ్లారు. తనకు కరోనా వచ్చినట్లు స్వయంగా ప్రకటించిన ఆయన.. ఇంటి నుంచే పరిపాలన వ్యవహారాలు చూస్తానని ట్వీట్ చేశారు. కానీ వ్యాధి తగ్గకపోగా మరింత తీవ్రం కావడంతో సోమవారం ఐసీయూకి తరలించారు. అంతకముందు బోరిస్ జాన్సన్ ఆరోగ్యం మెరుగపడి, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
కరోనా పాజిటివ్ అని తేలడంతో బోరిస్ జాన్సన్ పది రోజుల పాటు స్వీయ నిర్భందంలోనే ఉన్నారు. అయినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో డాక్టర్ల సలహా మేరకు లండన్‌లోని సెయింట్ థామస్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూకి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment