అతని నవ్వుకు పడిపోయాను: రాకుమారి | Japanese princess gives up her royal status to marry a piano-loving commoner she fell for because of his 'bright smiles like the sun' | Sakshi
Sakshi News home page

అతని నవ్వుకు పడిపోయాను: రాకుమారి

Published Mon, Sep 4 2017 9:36 AM | Last Updated on Sun, Sep 17 2017 6:23 PM

అతని నవ్వుకు పడిపోయాను: రాకుమారి

అతని నవ్వుకు పడిపోయాను: రాకుమారి

సాక్షి, టోక్యో: 'అతని నవ్వు సూర్య కాంతి వలె వెలుగునిస్తుంది' దాన్ని చూసే తాను కొమెరోను ప్రేమించానని జపాన్‌ రాకుమారి మకో మీడియా ప్రతినిధులతో మురిపెంగా చెప్పిన మాట. జపాన్‌ రాకుమారి మకో, లీగల్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న కొమెరోలకు ఆదివారం ఘనంగా నిశ్చితార్థం జరిగింది. వచ్చే ఏడాది శరదృతువులో ఇరువురికి రాజ సంప్రదాయాల ప్రకారం వివాహం జరగనుంది.

ఈ మధ్య సమయంలో జపాన్‌ రాజ వివాహాల పద్దతుల ప్రకారం జరగాల్సిన కొన్ని కార్యక్రమాలను జరిపిస్తారు. ఓ సాధారణ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని  రాకుమారి మకో నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ విషయం బయట ప్రపంచానికి తెలియడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. రాకుమారి మనసు దోచిందెవరా? అని అతని వైపు ఓ లుక్కేశారు కూడా. ఈ ఏడాది మేలో మకో, కొమెరోను వివాహం చేసుకోవాలని భావిస్తున్నట్లు ఆమె తన తల్లిదండ్రులు అకిషినో, కికోలకు చెప్పారు.



జపాన్‌ రాజప్రాసాద చట్టం ప్రకారం.. రాజ వంశానికి చెందిన యువతి సాధారణ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే రాజ గుర్తింపును వదులుకోవాలి. అంతేకాదు రాజ ప్రసాదం వదలి వెళ్లిపోవాలి. వీటి అన్నింటికి తాను సిద్ధమని కొమెరోతో తన వివాహం జరిపించాలని తల్లిదండ్రులను కోరింది. రాకుమారి కొమెరోను ఆమె తల్లిదండ్రులకు పరిచయం చేసినప్పుడు ఏమీ చేయడం లేదు. కేవలం రాకుమారిని ప్రేమిస్తున్నారంతే!

టోక్యో ఇంటర్నేషనల్‌ క్రిస్టియన్‌ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా పొందిన కొమెరో.. నిశ్చితార్థ సమయానికి మాత్రం లీగల్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించారు. స్కీయింగ్‌ చేయడం, వయెలిన్‌ ప్లే చేయడం కొమెరోకు బాగా వచ్చు. వంట కూడా అద్భుతః అనిపిస్తారట కొమెరో. పెళ్లి కోసం ఒక రాకుమారి సింహాసనాన్ని వదిలేసిన సందర్భం జపాన్‌ రాజవంశంలో ఇదే మొదటిది కాదు. మకో ఆంటీ సయాకో కూడా ఇలాగే ఒక సామాన్యుడిని చేసుకుని బయటికి వెళ్లిపోయారు. ‘అయ్యో! ఇలా ఒకరొకరు అంతఃపుర ఆడపడుచులు వెళ్లిపోతుంటే రాజకుటుంబం చిన్నబోదా.. చిన్నదైపోదా’ అని జపాన్‌ పౌరులు బెంగ పెట్టుకుంటున్నారట.

ప్రస్తుతం జపాన్‌ రాజకుటుంబానికి నలుగురే వారసులున్నారు. చక్రవర్తి అకిహిటో(83), ఆయనకు కొడుకులు ఇద్దరు, చక్రవర్తి తమ్ముడు, చక్రవర్తి గారి చిన్న కొడుకు గారి కొడుకు హిసాహిటో(10). చక్రవర్తికి మొత్తం నలుగురు గ్రాండ్‌ చిల్డ్రన్‌ ఉంటే.. వారిలో ముగ్గురు అమ్మాయిలే. ఆ అమ్మాయిల్లో మన లేటెస్ట్‌ హీరోయిన్‌ మకో(25) ఒకరు. ఇంకొకరు ఆమె చెల్లి కకో. మూడో మనవరాలు పెద్ద కొడుకు నరుహిటో కూతురు ఎయికో. అకిహిటో తర్వాత నరుహిటోనే చక్రవర్తి అవుతాడు. వచ్చే ఏడాది మేలో చక్రవర్తిగా నరుహిటో బాధ్యతలు స్వీకరిస్తారు.

నిశ్చితార్థం అనంతరం మీడియాతో మాట్లాడిన కాబోయే దంపతులు మకో, కెమెరోలు భవిష్యత్తులో తమ జీవితం ఆనందంగా ఉంటుందని భావిస్తున్నామని చెప్పారు. ఇద్దరం క్లాస్‌మేట్స్‌ అయినా తమ మధ్య బంధం బలపడింది మాత్రం విదేశాల్లో చదువు కోసం వెళ్లినప్పుడేనని వివరించారు. 2013 డిసెంబర్‌లో కెమెరోకు తాను ప్రపోజ్‌ చేసినట్లు మకో వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement