
అబిద్‌జాన్ : పశ్చిమ ఆఫ్రికాలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అబిద్‌జాన్‌లోని ఐవరీ కోస్ట్ సముద్ర తీరంలో ఓ కార్గో విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ విషయాన్ని రాయిటర్స్ స్పష్టం చేసింది. ఐవరీ కోస్ట్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో సహాయక బృందాలు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకున్నాయి.
కూలిపోయిన విమానంలో నుంచి రెండు మృతదేహాలను బయటకు తీశారు. మరో రెండు మృతదేహాలు వెలికి తీయాల్సి ఉండగా ఇద్దరు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కారణంగా విమానం కూలినట్లు అధికారులు చెబుతున్నారు. అబిద్‌జాన్ పెద్దమొత్తం జనాభా గల నగరం. దీంతో తీరంలో ఈ విమానం కూలిపోయిన కారణంగా ఇంకెవరైనా మృత్యువాత పడ్డారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment