
ఫిలిప్పీన్స్ : తన వ్యాపారానికి నష్టం కలిగిస్తున్నాయన్న కోపంతో వుసుర్ల(రెక్కల చీమలు)పై విరుచుకుపడ్డాడు. చేతికందిన కాడకి ఆ పురుగుల్ని పరపరా నమిలి మింగేశాడు ఓ వ్యక్తి. వివరాల్లోకి వెళితే.. ఫిలిప్పీన్స్‌లోని జనరల్ శాంతోస్ నగరానికి చెందిన రాండీ అలితా ‘పూల్ గేమ్’ను నిర్వహిస్తున్నాడు. అయితే రాత్రి సమయంలో పూల్ టేబుళ్లపై వేలాడదీసి ఉన్న లైట్ల దగ్గరకు భారీ సంఖ్యలో వుసుర్లు చేరుకున్నాయి. ఆట ఆడేందుకు వీలులేకుండా టేబుళ్లపై వాలసాగాయి. దీంతో ఆటగాళ్లు విసుగుచెంది మెల్లగా అక్కడినుంచి వెళ్లిపోవటం ప్రారంభించారు. కస్టమర్ల సంఖ్య తగ్గిపోవటంతో ఏం జరుగుతోందో తెలుసుకోవటానికి అలిత అక్కడకు వచ్చాడు. టేబుళ్లపై, వాటి చుట్టుప్రక్కల భారీ సంఖ్యలో పురుగులు ఎగరటాన్ని గుర్తించిన అలిత ఆగ్రహానికి గురయ్యాడు.
తన వ్యాపారానికి నష్టం కలిగిస్తున్నాయన్న కోపంతో పురుగులపై విరుచుకుపడి, చేతి కందిన కాడకి పురుగుల్ని నోట్లో వేసుకుని నమిలి మింగేశాడు. చివరకు వందల సంఖ్యలో ఉన్న పురుగుల్ని తినే ఓపికలేక తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment