వీడియో దృశ్యాలు
మనీలా: స్లో ఇంటర్‌నెట్ ఓ బాలిక కొంపముంచింది. ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసి కడుపు నింపుకుందామనుకున్న తనకు పెద్ద షాక్ తగిలింది. వివరాల్లోకి వెళితే.. ఫిలిప్పీన్స్‌కు చెందిన ఏడేళ్ల బాలిక కొద్దిరోజుల క్రితం ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసింది. ఇంటర్‌నెట్ స్లోగా ఉండటంతో కన్ఫర్మేషన్ బటన్‌ను పదేపదే నొక్కి తన కోసం, బామ్మ కోసం రెండు ఆర్డర్లను ప్లేస్ చేసింది. కొద్ది సేపటి తర్వాత కాలింగ్ బెల్ మోగటంతో హుషారుగా తలుపు తెరిచింది. ఇంటి ముందు క్యూలో నిలబడ్డ డెలివరీ బాయ్‌లను చూసి ఒక్కసారిగా ఖంగుతింది. దాదాపు 30 మంది బాయ్స్ ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 42 ఫుడ్ ఆర్డర్లను తెచ్చి ఆమె ముందు ఉంచారు. ( సెక్యూరిటీ కెమెరాల్లో పదిలంగా తండ్రి ప్రేమ )
దీంతో బాలికకేమీ అర్థం కాలేదు. ఫోన్‌లో తను ఉంచిన ఆర్డర్ల లిస్ట్‌ను ఓపెన్ చేసి చూసి షాక్ తింది. మొత్తం 42 ఆర్డర్లు ఉంచినట్లు అక్కడ చూపించింది. స్లో ఇంటర్‌నెట్ కారణంగానే ఇదంతా జరిగిందని తెలుసుకుంది. అయితే 40 ఆర్డర్లను ఏం చేయాలో తెలియలేదు. ఈ నేపథ్యంలో పొరుగింటి వారు బాలికకు సహాయం చేయటానికి ముందుకొచ్చారు. వీలైనన్ని ఆర్డర్లను వాళ్లు కొనుగోలు చేశారు. బాలిక పొరుగింట్లో ఉండే సుఆరెజ్ అనే మహిళ దీన్నంతా వీడియో తీసి తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment