బంగ్లాదేశ్ మహిళా ఎంపీ తమన్నా నుస్రత్
ఢాకా: బంగ్లాదేశ్ అధికార పార్టీకి చెందిన మహిళా ఎంపీ ఒకరు వర్సిటీ పరీక్షలను తన పోలికలతో ఉన్న 8మంది మహిళలతో రాయించారు. ఈ విషయం మీడియా బయటపెట్టడంతో ఆమెను వర్సిటీ బహిష్కరించింది. అధికార అవామీ లీగ్ పార్టీకి చెందిన ఎంపీ తమన్నా నుస్రత్ బంగ్లాదేశ్ ఓపెన్ యూనివర్సిటీలో బీఏ చదువుతున్నారు. ఇందులో భాగంగా 13 సబ్జెకుల పరీక్షలు రాసేందుకు తన మాదిరిగానే ఉన్న 8 మంది మహిళలను వినియోగించుకున్నారు. ఈ విషయాన్ని నాగరిక్ టీవీ అనే చానెల్ బయట పెట్టింది. పరీక్షలు రాస్తున్న సమయంలో వారికి ఎంపీ అనుచరులు కాపలాగా ఉన్నారని తెలిపింది. స్పందించిన వర్సిటీ అధికారులు ఎంపీ నుస్రత్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment