బాకులో చిక్కుకున్న ఎయిరిండియా ప్రయాణికులు | Mumbai-London Air India flight diverted to Baku | Sakshi
Sakshi News home page

బాకులో చిక్కుకున్న ఎయిరిండియా ప్రయాణికులు

Jul 11 2016 3:29 PM | Updated on Aug 17 2018 6:15 PM

బాకులో చిక్కుకున్న ఎయిరిండియా ప్రయాణికులు - Sakshi

బాకులో చిక్కుకున్న ఎయిరిండియా ప్రయాణికులు

లండన్ నుంచి ముంబైకు బయల్దేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపాలు తలెత్తడంతో దారిమళ్లించారు.

న్యూఢిల్లీ: లండన్ నుంచి ముంబైకు బయల్దేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపాలు తలెత్తడంతో దారిమళ్లించారు. ఈ విమానాన్ని అజర్బైజాన్లోని బాకు విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఆదివారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. ఎయిరిండియా విమానంలో 200 మంది ప్రయాణికులు వచ్చారు. వీరిని బాకు విమానాశ్రయంలో దించివేశారు.

బాకులో నిలిచిపోయిన ప్రయాణికులను ముంబైకు తీసుకురావడానికి భారత్ నుంచి మరో విమానాన్ని పంపినట్టు ఎయిరిండియా అధికారుల తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. కాగా బాకు విమానాశ్రయంలో ప్రయాణికులు సుదీర్ఘ సమయం చిక్కుకుపోయినట్టు సమాచారం. మరో విమానంలో ముంబైకు వచ్చేందుకు గంటలకొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement