నాసా రోబోలకూ స్మార్ట్‌ఫోన్లు!
లాస్ ఏంజెలిస్: ఇప్పటిదాకా మనుషులు మాత్రమే స్మార్ట్‌ఫోన్లను ఉపయోగించారు. ఇకపై అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన రోబోలు కూడా ఫోన్లను వాడనున్నాయి. అయితే అవి మనలా మాట్లాడేందుకు ఉపయోగించుకోవు లెండి. అంతరిక్షంలో తమ కదలికలను నియంత్రించుకుంటూ సురక్షితంగా తిరిగేందుకు ఉపయోగించుకోనున్నాయి. భూమి చుట్టూ తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లో రోబోలు మరింత తెలివిగా, సమర్థంగా పనిచేసేందుకు తోడ్పడే గూగుల్ 3డీ స్మార్ట్‌ఫోన్లను నాసా అక్కడికి పంపించనుంది. గూగుల్ స్మార్ట్‌ఫోన్లను రోబోలకు అమర్చితే అవి.. మోషన్-ట్రాకింగ్ కెమెరాలు, ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్ల సాయంతో ఐఎస్‌ఎస్ చుట్టూ సురక్షితంగా తిరగగలుగుతాయని నాసా భావిస్తోంది.
‘స్పియర్స్’ అని పేరుపెట్టిన ఈ రోబోలు ఐఎస్‌ఎస్‌లో వ్యోమగాములకు సహకరిస్తూ.. రోజువారీ పనులనే కాదు, ప్రమాదకరమైన పనులు చేసేందుకూ ఉపయోగపడతాయట. ఈ రోబోలకు కళ్లు, మెదడు గూగుల్ స్మార్ట్‌ఫోనే కానుందట. అయితే ఆకారంలో ఇవి మనుషులను పోలిన రోబోలలా ఉండవండోయ్. పేరుకు తగ్గట్టుగా గోళాకారపు బంతుల్లా ఉంటాయి. అన్నట్టూ.. వీటి పేరును విడమరిస్తే ‘ఉన్న స్థానాన్ని సరిచూసుకునే, పనిచేసే, కొత్త విషయాలు నేర్చుకునే, ప్రయోగాత్మక ఉపగ్రహాలు’ అనే అర్థం కూడా వస్తుంది. గ