న్యూఢిల్లీ: అమెరికాలో భారత రాయబారిగా నవతేజ్ సర్నా నియమితులవనున్నారు. విదేశీ వ్యవహా రాల మంత్రిత్వశాఖ ఈ విషయాన్ని గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. త్వరలోనే నవతేజ్ భాద్యతలను స్వీకరిస్తారని స్పష్టం చేసింది. ఇప్పటిదాకా ఈ పదవిలో కొనసాగిన అరుణ్‌కుమార్ సింగ్ ఆగస్టులో రిటైరయ్యారు. అరుణ్ కుమార్, నవతేజ్‌లో గతంలో ఇజ్రాయెల్‌లో భారత రాయబారులుగా పనిచేయడం తెలిసిందే.