అక్కడ సగం మంది వర్జిన్స్!
టోక్యో: జపాన్ లో ఒంటరిగా నివసిస్తున్న 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయసున్న స్త్రీపురుషుల్లో దాదాపు సగం మంది వర్జిన్స్ అని తాజా సర్వేలో వెల్లడైంది. ప్రపంచంలో అత్యధిక వృద్ధ జనాభా కలిగిన దేశంగా గుర్తింపు పొందిన జపాన్ లో వర్జిన్స్ సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. 42 శాతం మంది పురుషులు, 44.2 శాతం మహిళలు వర్జిన్స్ అని సర్వేలో తేలినట్టు ‘ది జపాన్ టైమ్స్’ తెలిపింది.
2010తో పోల్చుకుంటే ఇది సంఖ్య ఎక్కువ. 36.2 శాతం మంది పురుషులు, 38.7 శాతం మంది మహిళలు తమకు లైంగికానుభవం లేదని 2010 సర్వేలో వెల్లడించారు. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ అండ్ సోషల్ సెక్యురిటీ రీసెర్చ్ తాజా సర్వే నిర్వహించింది. అవివాహితులైన పురుషుల్లో 70 శాతం మంది, మహిళల్లో 60 శాతం మంది రీలేషన్షిప్ లో లేరని సర్వేలో తేలింది. 30 శాతం మంది పురుషులు, 26 శాతం మంది మహిళలు రీలేషన్షిప్ కోరుకుంటున్నట్టు చెప్పారు. దాదాపు 90 శాతం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు వెల్లడించారు. పెళ్లి ఎప్పుడనేది తమకు తెలియదని చెప్పడం విశేషం.