అలా బుక్కయ్యారు | New Zealand Father and son booked | Sakshi
Sakshi News home page

అలా బుక్కయ్యారు

Published Sun, Sep 20 2015 1:40 AM | Last Updated on Sun, Sep 3 2017 9:38 AM

అలా బుక్కయ్యారు

అలా బుక్కయ్యారు

న్యూజిలాండ్‌కు చెందిన తండ్రీకొడుకులు బ్రయాన్ రస్సెల్ ఫిన్, ల్యూక్ రస్సెల్ ఫిన్‌లు 2013లో థాయ్‌లాండ్ పర్యటనకు వచ్చారు. పటాంగ్ జిల్లాలోని బ్లూ మరైన్ రిసార్టులో 27 వేల రూపాయల ఫుడ్ బిల్లును చెల్లించకుండా వెళ్లిపోయారు. బహుశా ఈ సంగతిని వారు మర్చిపోయి ఉంటారు. రిసార్టు యాజమాన్యం మాత్రం వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగే లోపే వీరిద్దరూ దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. అయితే గత సోమవారం పర్యాటక నగరమైన ఫుకెట్‌లో దిగగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు వీరిద్దరినీ అరెస్టు చేశారు. న్యూజిలాండ్ రాయబార కార్యాలయానికి సమాచారమిచ్చి... స్థానిక పోలీసులకు అప్పగించారు. బిల్లు చెల్లించకుండా వెళ్లిపోయినందుకు వీరిద్దరూ ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నారు. థాయ్‌లాండ్‌లో కేసును ఎదుర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement