పొట్ట విప్పి చూడ ఎగ్స్ ఉండు.. | Nigerian villagers kill GIGANTIC snake only to discover it was filled with scores of eggs | Sakshi
Sakshi News home page

పొట్ట విప్పి చూడ ఎగ్స్ ఉండు..

Published Fri, Nov 11 2016 11:45 AM | Last Updated on Thu, Jul 11 2019 5:40 PM

పొట్ట విప్పి చూడ ఎగ్స్  ఉండు.. - Sakshi

పొట్ట విప్పి చూడ ఎగ్స్ ఉండు..

నైజీరియాలోని ఓ ఊరిలో దూడలు మాయమైపోవడం మొదలైంది.. గ్రామస్తులంతా ఇదో కొండచిలువ పనేనని అనుమానించారు.. వెతికారు.. అప్పుడే దేన్నో లాగించేసి.. బాగా బలిసినట్లు కనిపిస్తున్న కొండచిలువ వారికి కనిపించింది.. తమ దూడలను మింగేస్తోంది ఇదేనంటూ దాన్ని చంపారు.. పొట్ట విప్పి చూశారు.. తీరా చూస్తే.. ఇదిగో ఇలా దాదాపు వంద గుడ్లు కనిపించాయట. ఈ చిత్రం ప్రస్తుతం నెట్లో హల్‌చల్ చేస్తోంది. కొందరు ఆ జీవిపై సానుభూతి ప్రకటిస్తుండగా.. మరికొందరు ఈ గుడ్లన్నీ కొండచిలువలైతే.. ఆ గ్రామం పరిస్థితి ఏమి కాను అంటూ సమర్థించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement