మాస్కో(రష్యా): రష్యాలో శుక్రవారం తెల్లవారు జామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెటుషిన్‌స్కీ ప్రాంతంలోని పొక్రోవా రైల్వే స్టేషన్ వద్ద ఈ దారుణం జరిగింది. ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. రైలు వస్తుందన్న విషయాన్ని గమనించకుండా డ్రైవర్ పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే వేగంగా వస్తున్న రైలు బస్సును ఢీ కొట్టింది. ఈ ఘటనలో 19 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరి కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి.
మాస్కోకు తూర్పున ఉన్న వ్లాడిమీర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బాధితులంతా సెంట్ పీటర్స్‌బర్గ్, నిజ్నీ నొవ్‌గొరోడ్ ప్రాంతాలకు చెందినవారని పోలీసులు తెలిపారు.క్షతగాత్రుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఉజ్బెకిస్తాన్ ప్రాంతం నుంచి కార్మికులను తీసుకుని వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నంబర్ ప్లేట్ ఆధారంగా ఆ బస్సు కజికిస్తాన్‌లో రిజిస్టర్ అయిందని రష్యా న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment