
'మా పిల్లలకు ఆ ఉద్దేశం లేదు'
లాస్ ఎంజెల్స్: తమ పిల్లలను నటులుగా తీర్చిదిద్దే ఆలోచనేది ప్రస్తుతం తమకు లేదని ప్రముఖ హాలీవుడ్ స్టార్స్ బ్రాడ్ ఫిట్, ఎంజెలీనా జోలీ తెలిపారు. తన ఆరుగురు పిల్లల్లో ఒక్కరూ కూడా ఈ ఆలోచన చేయడంలేదని, తాము కూడా అలా భావిండచం లేదని తెలిపింది. తమ అడుగుజాడల్లోనే నటనా రంగం వైపు తమ పిల్లలు కూడా నడవాలని తాము అనుకోవడం లదని అన్నారు.
అయితే, వారికి నిజంగా అలాంటి అవకాశం వస్తే మాత్రం వదులుకోవద్దని వారికి చెప్తానని చెప్పుకొచ్చింది. 'వారు ఇంకా ముభావంగా ఉండే స్థాయిలోనే ఉన్నారు. వాస్తవానికి వారికి నటులుగా మారాలని లేదు. కానీ వారికి ఆ అవకాశం వస్తే వదులుకోవద్దని చెప్తాను' అని జోలీ చెప్పింది. కుంగ్ ఫు పాండా 3 అనే సినిమాను చూపించేందుకు తన పిల్లలను తీసుకొచ్చిన జోలీ ఈ విషయాలు పంచుకుంది.