
పొగలు కక్కే కాఫీ వద్దు!
కాఫీ ప్రియులకు శుభవార్త. కాఫీ తాగడం వల్ల కేన్సర్ బారిన పడబోరని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) బుధవారం స్పష్టం చేసింది.
వాషింగ్టన్: కాఫీ ప్రియులకు శుభవార్త. కాఫీ తాగడం వల్ల కేన్సర్ బారిన పడబోరని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) బుధవారం స్పష్టం చేసింది. సాధారణ వేడి ఉన్న కాఫీ తాగితే కేన్సర్ వచ్చే అవకాశం లేదని తమ పరిశోధనల్లో తేలినట్లు డబ్ల్యూహెచ్‌వోలో ఒక భాగమైన అంతర్జాతీయ కేన్సర్ పరిశోధనా సంస్థ బుధవారం వెల్లడించింది. అయితే అతి వేడిగా తీసుకునే పానీయాలు (65 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ వేడితో) అన్నవాహిక కేన్సర్‌కు దారి తీసే అవకాశాలున్నట్లు పేర్కొంది. అయితే 1991లో ప్రపంచ ఆరోగ్య సంస్థ కాఫీని కేన్సర్ కారకంగా ప్రకటించింది.