
మెల్‌బోర్న్: వైరస్‌కు చిన్నారుల ఆరోగ్యం అంతగా ప్రభావితం కావడంలేదని శాస్త్రవేత్తలు గత కొద్దిరోజులుగా గుర్తిస్తున్నారు. తాజా పరిశోధనలోనూ కరోనా బాధితుల్లో చిన్నారుల సంఖ్య అత్యల్పమని, వైరస్ సోకినప్పటికీ దాని తీవ్రత వారిపై అంతగా లేదన్నది స్పష్టమైంది. పీడియాట్రిక్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ జర్నల్‌లో ప్రచురితమైన వ్యాసంలో వైరస్ లక్షణాలు పిల్లల్లో తక్కువగా కనిపిస్తున్నాయనీ, వైరస్ సోకినప్పటికీ పెద్దవారితో పోల్చుకుంటే వ్యాధి తీవ్రత చాలాస్వల్పమని తేలింది. పెద్దలతో పాటు పిల్లలు వైరస్ ఇన్‌ఫెక్షన్‌కి గురవుతున్నారనీ, అయితే పెద్దల్లో మాదిరిగా తీవ్రమైన లక్షణాలు చిన్నారుల్లో కనిపించడంలేదని వెల్లడయ్యింది.
► కరోనా.. వైరస్ కుటుంబానికి చెందినవి.
► మనుషుల్లో వ్యాపించే కరోనావైరస్‌లు 4 రకాలు
► ఇవి ఎక్కువగా శ్వాసకోశ, జీర్ణాశయంలో ప్రభావం కలిగిస్తాయి.
► పెద్దలతో పోలిస్తే పిల్లలపై తక్కువ ప్రభావం చూపుతోంది.
► వృద్ధులపైనా, అనారోగ్యం బారినపడిన వారిపైనే ఎక్కువ ప్రభావం చూపుతోంది.
► పిల్లల నుంచి ఇతరులకు ఈ వైరస్ సంక్రమించడం కూడా అత్యల్పమే.
► వైరస్ సోకిన పిల్లలు సైతం ఒకటి రెండు వారాల్లో కోలుకుంటున్నారు.
► ప్రధానంగా ఇంట్లో కుటుంబసభ్యుల నుంచే కోవిడ్ వైరస్ పిల్లలకు సంక్రమిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment