పాకిస్థాన్ రక్షణ వ్యవస్థలో చైనా మిసైల్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ వాయు రక్షణ వ్యవస్థలో చైనా తయారు చేసిన ఎల్‌వై-80 ఉపరితల, వాయు మిసైల్‌ను ఉపయోగించనున్నట్లు ఆదివారం ఆ దేశ ఆర్మీఅధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పాకిస్థాన్ ఉపరితల రక్షణ కోసం దీన్ని ప్రవేశపెడ్తున్నట్లు ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ బజ్వా తెలిపారు.
మొబైల్ వాయు ఢిపెన్స్ వ్యవస్థతో పని చేసే ఇది ఎక్కువ దూరాల్లో నుంచి శత్రువులు చేసే దాడులను గుర్తిస్తుందన్నారు. ఎల్‌వై-80, పాక్ వాయు రక్షణ వ్యవస్థను పటిష్టం చేస్తుందని, వాయు బెదిరింపులను తిప్పికొడుతుందని తెలిపారు.