బీజింగ్: భారత్, రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణికి పోటీగా చైనాలోని ఓ మైనింగ్ సంస్థ సూపర్‌సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు అక్కడి ప్రభుత్వ మీడియా పేర్కొంది. ఈ క్షిపణిని చైనా మిత్రదేశం పాకిస్తాన్ కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉత్తర చైనాలోని ఓ రహస్య ప్రాంతంలో సోమవారం గువాంగ్‌డాంగ్ హోంగ్డా బ్లాస్టింగ్ కంపెనీ ఈ క్షిపణి పరీక్ష జరపగా, అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేస్తున్నట్లు తేలిందంటూ గ్లోబల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. హెచ్‌డీ–1 అని పేరుపెట్టిన ఈ క్షిపణిని హోంగ్డా సంస్థ తన సొంత ఖర్చుతో అభివృద్ధి చేస్తోంది. ప్రభుత్వం ఆమోదించాక హోంగ్డా కంపెనీ ఈ క్షిపణిని ఇతర దేశాలకు అమ్మనుంది.
Comments
Please login to add a commentAdd a comment