బీజింగ్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన షాక్‌తో పాకిస్తాన్ నెమ్మదిగా చైనావైపుకు అడుగులు వేస్తోంది. కొన్నేళ్లుగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావడం, సీపీఈసీ ప్రాజెక్ట్ వల్ల దగ్గరయ్యాయి. పాకిస్తాన్‌ను అగ్రరాజ్యం దూరం పెట్టడంతో.. ఆ దేశం చైనాకు సన్నిహితమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌లోని చాబహార్ పోర్టుకు దగ్గరగా ఉన్న పాకిస్తాన్ మిలటరీ బేస్‌ను చైనా తన అధీనంలోకి తీసుకున్నట్లు గ్లోబెల్ టైమ్స్ పత్రిక ప్రకటించింది. ట్రంప్ ట్వీట్‌తో పాకిస్తాన్-చైనా సంబంధాల్లో కొత్త శకం మొదలైందంటూ కమ్యూనిస్ట్ కంట్రీ అధికార పత్రిక స్పష్టం చేసింది.
ద్వైపాక్షిక వాణిజ్యం, ఇరు దేశాల మధ్య ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడుల్లో చైనా కరెన్సీ యువాన్ వినియోగానికి పాకిస్తాన్ స్టేట్ బ్యాంక్ ఆమోదం తెలపడం బంధాన్ని మరింత ధృఢతరం చేయడమేనని గ్లోబెల్ టైమ్స్ అభిప్రాయపడింది. దీంతో పాకిస్తాన్, చైనాలోని ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థలు ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల కార్యకలాపాల కోసం యువాన్‌ను వినియోగించడానికి అనుమతి లభించింది. ఈ కారణంతోనే చైనా తాజా మరో 50 బిలియన్ డాలర్ల పెట్టుబడిని పాకిస్తాన్‌లో పెడుతున్నట్లు ప్రకటించింది.
చైనా-పాకిస్తాన్ మధ్య సంబధాలు బలోపేతం కావడంపై వాషింగ్టన్ టైమ్స్ ఆందోళనలు వ్యక్తం చేసిది. పాక్‌లోని జివానీ ప్రాంతంలో చైనా ఓడరేపును, మిలటరీ బేస్‌ను ఏర్పాటు చేసుకుంటోంది. ఇది భవిష్యత్‌లో ప్రమాదకర పరిస్థితులును తీసుకువస్తుందని నిపుణులు చెబుతున్నారు. జివానీ ఓడరేవు ఇరాన్‌లోని చాబహార్ ఓడరేవు దగ్గరగా ఉంటుంది. అంతేకాక గల్ఫ్ ఆఫ్ ఒమన్‌కు సరిహద్దుకూడా, ఇక గ్వాదర్ నౌకాశ్రయానికి కూడా సమీపంలో ఉంటుంది. ఇది ఒక వ్యూహాత్మక ఎత్తుగడ అని అమెరికన్ మేధావులు అంటున్నారు. ఆప్ఘనిస్తాన్‌కు ఎగుమతుల కోసం ఇరాన్‌లోని చాబహార్ ఓడరేవును భారత్ అభివృద్ధి చేసింది. ఇది భారత్‌కు ఇబ్బందులు తెచ్చి పెట్టేదని అమెరికా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment