ఓ చిన్నారి గుక్కతిప్పుకోకుండా ఏడుస్తున్నందుకు.. తల్లిదండ్రులు కసాయిలుగా మారి పెద్ద శిక్ష వేసేందుకే సిద్ధమయ్యారు. తమకు నిద్రలేకుండా చేస్తున్నాడంటూ ఏకంగా బాబును వదిలించుకోవాలనుకున్నారు. అనుకుందే తడవుగా అమ్మకానికి పెట్టారు. 26 వేల రూపాయలు వెల కట్టారు. ఈ మేరకు ఓ వెబ్సైట్లో ప్రకటన ఇచ్చారు. చిన్నారి ఫొటోను కూడా ఉంచారు. ఈ వింత చోద్యం బ్రెజిల్లో చోటు చేసుకుంది.
ఈ ప్రకటన చూసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ప్రకటన ఇచ్చిన దంపతుల కోసం గాలిస్తున్నారు. వారి చిరునామా వివరాలు సరిగా లేకపోవడంతో దర్యాప్తు చేస్తున్నారు. వెబ్నిర్వాహకులను సంప్రదించి ఆ ప్రకటన తీసివేయించారు.
ఏడుస్తున్నాడని.. చిన్నారిని అమ్మకానికి ఉంచిన తల్లిదండ్రులు
Published Sun, Nov 17 2013 1:28 PM | Last Updated on Sat, Sep 2 2017 12:42 AM
Advertisement
Advertisement