
అటావా : మనం కోరుకున్నది వేరే వాళ్లకు దక్కినా.. మనకు మాత్రమే సొంతం అనుకున్న వాళ్లు వేరే వాళ్లతో చొరవగా ఉన్నా అసూయపడటం సర్వసాధారణం. అసూయ అన్నది కేవలం మనషులకు మాత్రమే సొంతం కాదని ఓ చిలుక నిరూపించింది. తన యాజమాని వేరే పక్షితో చొరవగా ఉండటాన్ని సహించలేక పోయింది. వివరాల్లోకి వెళితే.. కెనడాకు చెందిన ఆంటారియో అనే వ్యక్తి షాడో అనే చిలుకను పెంచుకుంటున్నాడు. అయితే ఓ రోజు షాడో తన దగ్గర ఉన్నపుడు ఓ బొమ్మపక్షికి ముద్దులు పెడతూ.. గట్టిగా శబ్ధాలు చేయటం ప్రారంభించాడు. ఇది గమనించిన షాడో! యాజమాని ముఖం దగ్గరకు పరుగులు తీసి, బొమ్మను ముక్కుతో పొడిచి ‘‘నీ ముద్దులు నాకే సొంతం’’ అన్నట్లుగా అతన్ని ముద్దుపెట్టుకోవటానికి ప్రయత్నించింది.
ఆంటారియో వెంటనే షాడోను దూరంగా జరిపి మళ్లీ బొమ్మకు ముద్దులు ఇవ్వటం ప్రారంభించగా షాడో మళ్లీ అలాగే చేసింది. ఇలా నాలుగైదుసార్లు జరిగింది. షాడో అసూయ పడటాన్ని చూసి ఆ యాజమాని, అతడి భార్య అలెగ్జాండ్రియా షార్పే థామ్సన్ తెగనవ్వేసుకున్నారు. ఈ దృశ్యాలను వీడియో తీసిన అలెగ్జాండ్రియా దాన్ని షాడోకు చెందిన ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచింది. దీంతో వీడియో కాస్త వైరల్ అయ్యింది. ప్రస్తుతం షాడో ఇన్‌స్టాగ్రామ్‌కు మూడు వేలమంది ఫాలోయర్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment