అండాలను దొంగిలిస్తున్న డాక్టర్ అరెస్టు! | Pioneering Italian doctor suspected of stealing patient's eggs | Sakshi
Sakshi News home page

అండాలను దొంగిలిస్తున్న డాక్టర్ అరెస్టు!

Published Sat, May 14 2016 6:53 PM | Last Updated on Thu, Jul 11 2019 5:40 PM

అండాలను దొంగిలిస్తున్న డాక్టర్ అరెస్టు! - Sakshi

అండాలను దొంగిలిస్తున్న డాక్టర్ అరెస్టు!

మహిళలకు తెలియకుండా.. వారి అండాలను దొంగిలిస్తున్న ఆరోపణలపై ఇటాలియన్ గైనకాలజిస్టు ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. 60 ఏళ్ల వయసులో ఉన్న మహిళలకు కూడా సంతానభాగ్యం కల్పిస్తున్నారని ఆయనకు మంచి పేరుంది. అయితే.. ఒవేరియన్ సిస్ట్ ఉందని చికిత్స చేయించుకోడానికి వెళ్తే, తనకు తెలియకుండా సెవెరినో ఆంటినోరి (70) అనే ఈ వైద్యుడు తన అండాలను దొంగిలించారని స్పెయిన్‌కు చెందిన 24 ఏళ్ల మహిళ ఫిర్యాదుచేసింది. దాంతో పోలీసులు సదరు వైద్యుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతానికి ఏడాది పాటు ఆయన ప్రాక్టీసు చేయడానికి వీల్లేకుండా లైసెన్సు సస్పెండ్ చేయడంతో పాటు ఆయనను రోమ్‌లో గృహ నిర్బంధంలో ఉంచారు.

ఫిర్యాదుచేసిన స్పానిష్‌ మహిళ వృత్తిరీత్యా నర్సు. ఆమె అదే వైద్యుడి ఆస్పత్రిలో పనిచేస్తోంది. అనుకోకుండా ఆమెను కలిసిన ఆంటినోరి.. ఆమెకు ఇంటర్వ్యూ ఏర్పాటుచేశారని, ఆ తర్వాత ఆమెకు ఒవేరియన్ సిస్ట్ ఉందని చెప్పి.. ఆమెకు తెలియకుండా అండాలను సంగ్రహించారని న్యాయవాదులు ఆరోపించారు. అయితే ఆంటినోరి లాయర్లు మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. 63 ఏళ్ల వయసున్న ఇటలీ మహిళ రొసానా డెల్లా కోర్టెకు సంతానభాగ్యం కల్పించడం ద్వారా 1994లో ఆంటినోరి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందారు. అప్పటికి కొడుకును కన్న అత్యంత పెద్దవయసు మహిళ ఆమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement