సాక్షి,న్యూఢిల్లీ:జపాన్ ప్రధాని షింజో అబే నేతృత్వంలోని పాలక కూటమి ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ ప్రధానికి అభినందనలు తెలిపారు. జపాన్ దిగువ సభలో పాలక కూటమికి మూడింట రెండు వంతుల మెజారిటీ దక్కింది. భారత్, జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమయ్యేందుకు ఈ గెలుపు ఉపకరిస్తుందని మోదీ ట్వీట్ చేశారు.
‘ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన స్నేహితుడు షింజో అబేకు శుభాకాంక్షలు...ఈ గెలుపు ద్వైపాక్షిక సంబంధాల్లో మేలి మలుపుకు శ్రీకారం చుడుతుంద’ని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.465 మంది సభ్యులు కలిగిన జపాన్ పార్లమెంట్ దిగువ సభలో పాలక లిబరల్ డెమొక్రటిక్ పార్టీ కూటమి 312 స్థానాల్లో గెలుపొందింది. ఉత్తర కొరియాతో ముప్పు పెరుగుతున్న క్రమంలో తాజాగా ప్రజల తీర్పు పొందేందుకు షింజో అబే గత నెలలో పార్లమెంట్ దిగువ సభను రద్దు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment