Japan PM
-
Japan PM: జపాన్ ప్రధానికి తప్పిన ముప్పు.. అతి సమీపంలో పేలుడు..
టోక్యో: జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదాకు త్రుటిలో ప్రమాదం తప్పింది. పశ్చిమ ప్రాంత వకయామ ప్రిఫెక్చర్‌లోని తీర నగరం సైకజాకిలో శనివారం ఆయన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వెళ్లారు. ప్రసంగానికి కొద్దిసేపటి ముందు కిషిదా నిల్చున్న ప్రదేశానికి అతి సమీపంలో పెద్ద శబ్దంతో పేలుడు వినిపించింది. అంతటా దట్టమైన పొగలు వ్యాపించాయి. వెంటనే పోలీసులు మాస్క్ ధరించి ఉన్న ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న మరో ట్యూబ్‌ను స్వాధీనం చేసుకున్నారు. BREAKING: Japanese Prime Minister Kishida evacuated after loud bang; suspect in custody pic.twitter.com/iQDZeCOePh — BNO News Live (@BNODesk) April 15, 2023 పేలుడుతో అక్కడికి చేరిన ప్రజలు భయంతో అరుస్తూ పరుగులు తీశారు. ఎవరికీ ఎటువంటి హాని జరగలేదని పోలీసులు చెప్పారు. ఈ అనూహ్య ఘటనతో కిషిదా కొంత భయపడినట్లు కనిపించారు. అనంతరం ప్రచార కార్యక్రమాలను ఆయన యథా ప్రకారం కొనసాగించారు. అనుమానిత వస్తువును విసిరినట్లు భావిస్తున్న ఒక యువకుడిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారని చీఫ్ కేబినెట్ సెక్రటరీ హిరొకజు మట్సునో చెప్పారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్న ఆయన.. ఘటన వెనుక కారణాలపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. అది ఎటువంటి పేలుడు వస్తువనే విషయం వెల్లడి కావాల్సి ఉంది. పైపు బాంబు అయి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆదివారం హాట్ స్ప్రింగ్ రిసార్టు పట్టణం కరుయిజావాలో జి–7 దేశాల విదేశాంగ మంత్రుల భేటీ జరగనుండగా ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ నెల 23వ తేదీన జపాన్ వ్యాప్తంగా స్థానిక ఎన్నికలు, కొన్ని పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితోపాటు, మేలో కిషిదా సొంత పట్టణం హిరోíÙమాలో జి–7 నేతల శిఖరాగ్రం జరగనుంది. చదవండి: ఆ దేశాలకు ఆయుధాలు అమ్మబోం.. అలాంటి ఉద్దేశమే లేదు: చైనా -
భౌగోళిక రాజకీయ బంధం
పర్యటన పట్టుమని రెండే రోజులు. అలాగని తేలిగ్గా తీసుకుంటే పొరపాటే. మార్చి 20, 21ల్లో జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిదా జరిపిన భారత పర్యటన గురించి ప్రత్యేకించి చెప్పుకొనేది అందుకే. ఇండియా జీ20కీ, జపాన్ జీ7 దేశాల కూటమికీ సారథ్యం వహిస్తున్న వేళ ఇరు దేశాల నేతలూ సమావేశం కావడం కచ్చితంగా విశేషమే. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను తీవ్రంగా తప్పుబడుతున్న జీ7 అజెండా జపాన్‌ది కాగా, అదే ఉక్రెయిన్ అంశం కారణంగా జీ20లో ఏకాభిప్రాయం రాక ఇబ్బంది పడుతున్న పరిస్థితి భారత్‌ది. ఈ పరిస్థితుల్లో ఇరు దేశాధినేతల సమావేశం, స్నేహపూర్వక సంభాషణలు – పానీపురీ చిరుతిళ్ళతో ఛాయాచిత్రాలు, భారత్‌లో లక్షల కోట్లలో పెట్టుబడులు పెడతామని కిషిదా ప్రకటన, చైనా కట్టడికి ‘ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో – పసిఫిక్’ అవసరం అంటూ కొత్త పల్లవిని ఎత్తుకోవడం – ఇలా 27 గంటల సుడిగాలి పర్యటనలో గుర్తుండే ఘటనలు అనేకం. సరిగ్గా చైనా అధ్యక్షుడు రష్యాలో పర్యటిస్తున్న వేళ జపాన్ ప్రధాని భారత్‌కు రావడం ప్రచ్ఛన్న యుద్ధానంతర ప్రపంచంలో మారుతున్న భౌగోళిక రాజకీయాలకు మచ్చుతునక. పదిహేనేళ్ళ క్రితం 2008లో అప్పటి జపాన్ ప్రధాని షింజో అబే భారత్‌లోనే తన సిద్ధాంతమైన పసిఫిక్, హిందూ మహాసముద్రాల సంగమాన్ని వ్యూహాత్మక దర్శనం చేశారు. ఇప్పుడు కిషిదా ‘క్వాడ్’ కూటమిలో ఇతర భాగస్వామ్య దేశాలైన ఆస్ట్రేలియా, అమెరికాల్లో కాక భారత్‌లో ‘స్వేచ్ఛా వాణిజ్యంతో కూడిన ఓపెన్ ఇండో–పసిఫిక్’ అంటూ సైద్ధాంతిక ప్రకటన చేయడం విశేషం. భారత, జపాన్ ప్రధానుల ద్వైపాక్షిక సమావేశాలు 2006 నుంచి జరుగుతూనే ఉన్నాయి. ప్రోటోకాల్ ప్రకారం ఈసారి మోదీ జపాన్‌కు వెళ్ళాలి. అయితే, కిషిదా తానే హడావిడిగా భారత్‌కు రావడానికి కారణం ఉంది. మార్చి మొదట్లో భారత్‌లో జీ20 విదేశాంగ మంత్రుల సమావేశానికి జపాన్ విదేశాంగ మంత్రి హాజరు కాలేదు. ప్రతినిధిని పంపారు. అమెరికా, చైనా, ఆస్ట్రేలియా, రష్యా, బ్రిటన్ తదితర దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొన్న అరుదైన కలయికకు హాజరవడం ఎంత ముఖ్యమో ఒకప్పటి విదేశాంగ మంత్రి కిషిదాకు తెలుసు. భౌగోళిక – రాజకీయ పటంలో తన స్థానాన్నీ, ప్రాధాన్యాన్నీ పెంచుకోవాలనుకొంటున్న తమ దేశం పక్షాన ఆయన ఠక్కున తప్పు దిద్దుకొన్నారు. నిజానికి, భారత – జపాన్‌లు ఏడు దశాబ్దాల సుదీర్ఘ స్నేహాన్ని గడచిన 2022లోనే ఘనంగా జరుపుకొన్నాయి. ఒకప్పుడు మామూలు ప్రపంచ భాగస్వామ్యంగా మొదలై నేడు వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యంగా అది పెంపొందింది. అయితే, ఇప్పటికీ ఆర్థిక భాగస్వామ్యంలో, జనం మధ్య సంబంధాల్లో అంతరాలున్నాయి. వాటి భర్తీకి కిషిదా తాజా పర్యటన దోహదకారి. అలాగే, ఈ పర్యటనను కేవలం దౌత్య తప్పిదాన్ని సరిదిద్దే యత్నంగానే చూడనక్కర లేదు. జీ20లో అన్ని దేశాలూ కలసి చేయాల్సిన ప్రకటనకు చిక్కులు విడిపోలేదు గనక ప్రస్తుత జీ20, జీ7 సారథులిద్దరూ వివరంగా మాట్లాడుకొనడానికి ఇది సదవకాశమైంది. హిరోషిమాలో జరిగే జీ7 సదస్సులో పరిశీలకుడిగా పాల్గొనాలంటూ కిషిదా ఆహ్వానం, మోదీ అంగీకారం చెప్పుకోదగ్గవే. అయిదేళ్ళలో తమ సంస్థలు భారత్‌లో 5 లక్షల కోట్ల యెన్లు (4200 కోట్ల డాలర్లు) పెట్టుబడి పెడతాయని గత మార్చిలో మాటిచ్చిన జపాన్ నెమ్మదిగా అయినా ఆ దిశగా అడుగులు వేస్తోంది. కిషిదా వెల్లడించిన భౌగోళిక రాజకీయాల్లో, వ్యూహాల్లో కీలకమైన ‘ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో – పసిఫిక్’ ప్రతిపాదన భారత్‌కూ లాభదాయకమే. ఇండో– పసిఫిక్‌లో చైనాకు ముకుతాడు వేయడా నికి పొరుగు దేశంతో కలసి నడవ్వచ్చు. కాకపోతే ప్రచ్ఛన్న యుద్ధం ముగిసినా – తన గడ్డపై అమెరి కన్ సైనిక స్థావరాలను కొనసాగనిస్తూ, పాశ్చాత్య ప్రపంచంతో సైద్ధాంతిక స్నేహాన్ని కొనసాగిస్తున్న జపాన్ రక్షణ సామగ్రి, సాంకేతిక పరిజ్ఞాన సహకారంపై ఆరు విడతల చర్చల అనంతరం కూడా భారత్‌తో సంయుక్త భాగస్వామ్యానికి అడుగేయలేదు. రక్షణ ఉత్పత్తుల తయారీలో ‘సహ– ఆవిష్కరణ, సహ–రూపకల్పన, సహ–సృష్టి’ అవసరమంటూ తాజా పర్యటనలో కిషిదాకు మోదీ చెప్పాల్సి వచ్చింది. మూడో దేశంతో కలసి రక్షణ విన్యాసాలు అనేకం చేస్తున్నప్పటికీ, రక్షణ రంగంలో భారత్, జపాన్‌లు చేతులు కలపనిదే సంపూర్ణ ‘ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో–పసిఫిక్’ సాధ్యం కాదని కిషిదాకూ తెలుసు. అలాగే, భారీ భారత విపణిలో భాగస్వామ్యానికి ఆసక్తిగా ఉన్నప్పటికీ, భారత్‌లో వస్తూత్పత్తి రంగంలో పెట్టుబడులకు జపాన్‌లో తటపటాయింపు పోవాల్సి ఉంది. ఉక్రెయిన్ యుద్ధం అంశంలో భేదాభిప్రాయాలను పక్కన పెట్టాల్సి ఉంది. మొత్తానికి ఉమ్మడి బెడదైన చైనా వల్ల భారత్, జపాన్‌లు మరింత సన్నిహితం కావచ్చు. నిరుడు 3 సార్లు, ఈ ఏడాది ఇకపై మరో 3 సార్లు ఇరువురు ప్రధానులూ కలవనుండడంతో ఇండో– పసిఫిక్ భౌగోళిక రాజకీయాల్లో మరిన్ని అడుగులు ముందుకు పడవచ్చు. భారత్‌కు కూడా రానున్న నెలలు కీలకం. భారత ప్రధాని మేలో జీ7 సదస్సులో, ఆ తర్వాత ఆస్ట్రేలియాలో ‘క్వాడ్’ సమావేశంలో పాల్గొంటారు. అటుపైన అమెరికాను సందర్శించనున్నారు. రాగల కొద్ది నెలల్లోనే ఎస్సీఓ, జీ20 సదస్సుల నిమిత్తం రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత షీ జిన్పింగ్లకు రెండు సార్లు ఆతిథ్య మిచ్చే అవకాశం భారత్‌కు రానుంది. వీటన్నిటి నేపథ్యంలో కిషిదా పర్యటన రానున్న సినిమాకు ముందస్తు ట్రైలర్. ప్రపంచం మారుతున్న వేళ మన భౌగోళిక రాజకీయ స్థానాన్ని పునర్నిర్వచించుకోవడానికి ఇది మంచి తరుణం కావచ్చు. విశ్వవేదిక సిద్ధమైంది. మరి, మనమూ సంసిద్ధమేనా? -
జపాన్ కొత్త ప్రధాని కీలక ప్రకటన
టోక్యో: జపాన్ కొత్త ప్రధానిగా ఫుమియో కిషిడాను ఆ దేశ పార్లమెంట్ సభ్యులు సోమవారం ఎన్నుకున్నారు. అనంతరం ఆయన కీలక ప్రకటన చేశారు. వచ్చే వారంలో పార్లమెంటు దిగువ సభను రద్దు చేయనున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 31న ఎన్నికలకు వెళతామని చెప్పారు. కిషిడా గతంలో ఆయన దౌత్యవేత్తగా పని చేశారు. కరోనా మిగిల్చిన ఆర్థిక సంక్షోభం, చైనా–ఉత్తరకొరియాలను ఎదుర్కోవడం, రానున్న జాతీయ ఎన్నికలు వంటి అంశాలపై ఆయన తీవ్రంగా కృషి చేయాల్సి ఉంది. ఈ అంశాలపై సరిగ్గా పని చేయలేకపోయారన్న కారణాలతోనే మాజీ ప్రధాని యోషిహిడే సుగా రాజీనామా చేయాల్సి వచ్చింది. చదవండి: (మోదీ, యోగి ప్రభుత్వాల పతనం ఖాయం) అన్ని చక్కదిద్దుతాను.. పదవిని చేపట్టాక తన మొదటి ప్రాధాన్యత ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టడమేనని గతంలో వ్యాఖ్యానించిన ప్రధాని ఫుమియో కిషిడా, కరోనాను ఎదుర్కోవడానికి భారీ ఆర్థిక ప్యాకేజ్ అవసరమని చెప్పారు. అందుకు స్పష్టమైన ప్రజా తీర్పు అవసరమని, ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు వెళ్లనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కరోనాపై తమ పోరు కొనసాగుతుందని, జీ–20, కాప్–26 వాతావరణ సదస్సులకు వ్యక్తిగతంగా హాజరై వాటిని ఆమోదింపజేస్తానని అన్నారు. సుగా కేబినెట్లో మొత్తం 20 మంత్రులు ఉండగా, కిషిడా కేబినెట్లో 13 మంది మాత్రమే ఉన్నారు. సుగా కేబినెట్ నుంచి కేవలం ఇద్దరు మాత్రమే తాజా కిషిడా కేబినెట్లో కూడా ఉన్నారు. 13 మంది కేబినెట్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. అమెరికా, బ్రిటన్లతో పాటు ఆసియా,యూరోప్‌లలోని పలు ప్రజాస్వామ్య దేశాలతో బలమైన సంబంధాలు ఏర్పరచాలన్నది కిషిడా ఆలోచన. చదవండి: (ఆ ఒక్క కారణంతో కోవిడ్ పరిహారాన్ని ఆపొద్దు) మోదీ శుభాకాంక్షలు.. జపాన్ నూతన ప్రధానిగా ఎన్నికైన ఫుమియో కిషిడాకు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో కలసి పని చేసేందుకు వేచి చూస్తున్నట్లు పేర్కొన్నారు. -
శాంతి, ప్రగతి మా ప్రాథమ్యాలు
సింగపూర్: ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, అభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. సభ్య దేశాల మధ్య బహుళ రంగాల్లో సహకారం, సంబంధాలు పరిపుష్టం కావాలని ఆకాంక్షించారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన గురువారం జరిగిన 13వ తూర్పు ఆసియా దేశాల సదస్సులో పాల్గొన్నారు. తూర్పు ఆసియా సమావేశానికి మోదీ హాజరుకావడం ఇది 5వ సారి. ‘సభ్య దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలతో పాటు బహుళ రంగాల్లో సహకారం పెరగాలని తూర్పు ఆసియా దేశాల సదస్సు(ఈఏఎస్)లో నా ఆలోచనలు పంచుకున్నా. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశా’ అని మోదీ ఆ తరువాత ట్వీట్ చేశారు. అంతకుముందు, జపాన్ ప్రధాని షింజో అబేతో పాటు పలువురు దేశాధినేతలతో మోదీ సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. దానికి ముందు జరిగిన ఆసియాన్–ఇండియా అల్పాహార సమావేశంలో మోదీ మాట్లాడుతూ..వ్యూహాత్మక ఇండో–పసిఫిక్ ప్రాంత అభివృద్ధికి తీర భద్రతలో సహకారం, వాణిజ్య వికేంద్రీకరణ కీలకమని నొక్కిచెప్పారు. కేడెట్ మార్పిడి కార్యక్రమంలో భాగంగా సింగపూర్‌లో పర్యటిస్తున్న ఎన్సీసీ కేడట్లను కలుసుకున్న మోదీ వారితో కాసేపు ముచ్చటించారు. మోదీ రెండు రోజుల సింగపూర్ పర్యటన ముగించుకొని సాయంత్రం తిరుగు పయనమయ్యారు. హ్యాకథాన్ విజేతలకు సత్కారం.. ఇండియా, సింగపూర్ సంయుక్తంగా నిర్వహించిన తొలి హ్యాకథాన్ విజేతల్ని మోదీ సత్కరించారు. 36 గంటల పాటు జరిగిన గ్రాండ్ ఫినాలేలో రెండు దేశాల నుంచి మూడేసి చొప్పున జట్లు ఈ పోటీలో గెలుపొందాయి. భారత్ నుంచి విజేతలుగా నిలిచిన జట్లలో ఐఐ టీ ఖరగ్‌పూర్, ఎన్ఐటీ తిరుచ్చి, పుణే ఎంఐటీ ఇంజినీరింగ్ కాలేజ్ బృందాలున్నాయి. సింగ పూర్ మంత్రి ఓంగ్ యే కుంగ్‌తో కలసి మోదీ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. -
జపాన్ ప్రధానికి మోదీ విషెస్
సాక్షి,న్యూఢిల్లీ:జపాన్ ప్రధాని షింజో అబే నేతృత్వంలోని పాలక కూటమి ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ ప్రధానికి అభినందనలు తెలిపారు. జపాన్ దిగువ సభలో పాలక కూటమికి మూడింట రెండు వంతుల మెజారిటీ దక్కింది. భారత్, జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమయ్యేందుకు ఈ గెలుపు ఉపకరిస్తుందని మోదీ ట్వీట్ చేశారు. ‘ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన స్నేహితుడు షింజో అబేకు శుభాకాంక్షలు...ఈ గెలుపు ద్వైపాక్షిక సంబంధాల్లో మేలి మలుపుకు శ్రీకారం చుడుతుంద’ని మోదీ తన ట్వీట్లో పేర్కొన్నారు.465 మంది సభ్యులు కలిగిన జపాన్ పార్లమెంట్ దిగువ సభలో పాలక లిబరల్ డెమొక్రటిక్ పార్టీ కూటమి 312 స్థానాల్లో గెలుపొందింది. ఉత్తర కొరియాతో ముప్పు పెరుగుతున్న క్రమంలో తాజాగా ప్రజల తీర్పు పొందేందుకు షింజో అబే గత నెలలో పార్లమెంట్ దిగువ సభను రద్దు చేసిన సంగతి తెలిసిందే. -
కర్నూలుకు ప్రధాని మోదీ!
- జూన్‌లో భారీ సోలార్ పార్క్ ప్రారంభోత్సవం - జపాన్ ప్రధానికీ ఆహ్వానం... సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రపంచంలోనే అతిపెద్దదైన కర్నూలు జిల్లాలోని సోలార్ పార్కు ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే అవకాశం ఉంది. ఒకే చోట ఏకంగా 1000 మెగావాట్ల సోలార్ పార్కు ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడా లేదు. కర్నూలు జిల్లాలోని గని–శకునాల గ్రామాల పరిధిలో ఏర్పాటైన ఈ మెగా సోలార్ పార్కు జూన్ నెలలో ప్రారంభం కానుంది. ఇప్పటికే సుమారు 900 మెగావాట్ల సామర్థ్యం వరకూ సోలార్ పార్కు పనులు పూర్తయ్యాయి. మిగిలిన 100 మెగావాట్ల పనులు కూడా పూర్తయిన తర్వాత జూన్ నెలలో ప్రధాని మోదీని ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా ఇక్కడ సోలార్ ప్లాంటును నెలకొల్పిన జపాన్‌కు చెందిన సాఫ్ట్ బ్యాంకు ద్వారా జపాన్ ప్రధానిని కూడా రప్పించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
చెన్నైవరద మృతులకు జపాన్ ప్రధాని సంతాపం
న్యూఢిల్లీ: చెన్నై వరదల్లో మరణించిన వారికి జపాన్ ప్రధానమంత్రి షింజొ అబే ప్రగాఢ సంతాపం తెలిపారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన చెన్నై మృతులకు సంతాపాన్ని ప్రకటించారు. మూడవ సారి భారత పర్యటనకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అటు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, షింజొ పర్యటనను ఆహ్వానిస్తూ ట్వీట్ చేశారు. షింజొ భారతదేశ సందర్శన ఇరుదేశాల సంబంధాలకు కొత్త బలాన్ని, ఉత్సాహాన్ని అందిస్తుందన్నారు. ఈ మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న జపాన్ ప్రధానికి విమానాశ్రయంలో కేంద్రమంత్రి జయంత్ సిన్హా తదితరులు ఘన స్వాగతం తెలిపారు. షింజొ రేపు ప్రధాని మోదీతో కలిసి వారణాసిలో పర్యటించనున్నారు. అనంతరం ఇండో-జపాన్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. -
తిమింగలాల కోసం ..
టోక్యో: జపాన్ లో మరోసారి అధికారిక వెబ్‌సైట్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. తాజాగా గురువారం ప్రధాన మంత్రి షింజో అబే అధికారిక వెబ్‌సైట్‌ను హాకర్స్ క్రాష్ చేశారు. దేశంలో విచ్చలవిడిగా జరుగుతున్న తిమింగలాల వేటను నిరసిస్తూ ఈ చర్యకు పూనుకున్నామని ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికార ప్రతినిధి కూడా ధృవీకరించారు. గుర్తుతెలియని వ్యక్తులు తమ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసినట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారన్నారు. త్వరలోనే సైట్ ను పునరుద్ధరిస్తామని క్యాబినెట్ ముఖ్యకార్యదర్శి యోషిండే సుగా ప్రకటించారు. తిమింగలాలను వేటాటడం సరైంది కాదని, అంతరించి పోతున్న తిమింగలాల జాతిని కాపాడాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందని హ్యాకర్లు ట్వీట్ చేశారు. ఇటీవల జరిగిన వెబ్సైట్ దాడులకు తమదే బాధ్యత అని కూడా ఆ గ్రూపు ప్రకటించింది. కాగా తిమింగాల వేటపై అనేక నిరసనలు వ్యక్తమవుతున్నాయి. -
లీ క్యుయాన్ యో అంత్యక్రియలకు జపాన్ ప్రధాని
టోక్యో: జపాన్ ప్రధాని షింజోఅబే మార్చి 29 వ తేదీన సింగపూర్‌లో పర్యటించనున్నారు. ఆయన సింగపూర్ మాజీ ప్రధానమంత్రి లీ క్యుయాన్ యో(91) అంత్యక్రియల్లో పాల్గొననున్నారని జపాన్ కేబినెట్ ప్రధాన కార్యదర్శి యోషిహిడే ప్రెస్ మీట్ లో ప్రకటించారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు స్థానిక నాయకులూ పాల్గొననున్నారు. లీ క్యుయాన్ యో మార్చి 23 వ తేదీ మరణించారు. ఆయన 1965-1990 మధ్య కాలంలో సింగపూర్ ప్రధానిగా సేవలందించారు. అనంతరం ఆయన సీనియర్ మంత్రిగా, మంత్రి వర్గ సలహాదారుగా దేశానికి సేవలందించారు. -
నేటీతో ముగియనున్న చంద్రబాబు పర్యటన
-
జఫాన్ ప్రధానిని కలసిన చంద్రబాబు