కర్నూలుకు ప్రధాని మోదీ! | PM Modi to Kurnool | Sakshi
Sakshi News home page

కర్నూలుకు ప్రధాని మోదీ!

Published Tue, Apr 25 2017 12:47 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

కర్నూలుకు ప్రధాని మోదీ! - Sakshi

కర్నూలుకు ప్రధాని మోదీ!

- జూన్‌లో భారీ సోలార్‌ పార్క్‌ ప్రారంభోత్సవం
- జపాన్‌ ప్రధానికీ ఆహ్వానం...


సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రపంచంలోనే అతిపెద్దదైన కర్నూలు జిల్లాలోని సోలార్‌ పార్కు ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే అవకాశం ఉంది. ఒకే చోట ఏకంగా 1000 మెగావాట్ల సోలార్‌ పార్కు ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడా లేదు. కర్నూలు జిల్లాలోని గని–శకునాల గ్రామాల పరిధిలో ఏర్పాటైన ఈ మెగా సోలార్‌ పార్కు జూన్‌ నెలలో ప్రారంభం కానుంది. ఇప్పటికే సుమారు 900 మెగావాట్ల సామర్థ్యం వరకూ సోలార్‌ పార్కు పనులు పూర్తయ్యాయి.

మిగిలిన 100 మెగావాట్ల పనులు కూడా పూర్తయిన తర్వాత జూన్‌ నెలలో ప్రధాని మోదీని ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా ఇక్కడ సోలార్‌ ప్లాంటును నెలకొల్పిన జపాన్‌కు చెందిన సాఫ్ట్‌ బ్యాంకు ద్వారా జపాన్‌ ప్రధానిని కూడా రప్పించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement