
అమెరికా చేరుకున్న ప్రధాని మోదీ
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి 70 వ వార్షికోత్సవంలో పాల్గొనడానికి బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉదయం అమెరికాలోని న్యూయార్క్ చేరుకున్నారు. రేపు(శుక్రవారం) ఐక్యరాజ్యసమితి సంస్కరణపై మోదీ ప్రసంగించనున్నారు. ఐదురోజుల పాటూ మోదీ అమెరికాలో పర్యటించనున్నారు.
అమెరికా అధ్యక్షుడు ఒబామాతో మోదీ చర్చలు జరపనున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ అమెరికాలో పర్యటించడం ఇది రెండో సారి.