
జాంటీ రోడ్స్‌ను సర్‌ప్రైజ్ చేసిన పీఎం మోదీ
ఆఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ కూతురు ఇండియా జియాన్నేకు ఈసారి పెద్ద మొత్తంలో జన్మదిన శుభాకాంక్షలు అందాయి. దాదాపు 120 కోట్ల మంది నుంచి (భారత్ నుంచి) ఆ చిట్టిపాపకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
న్యూఢిల్లీ: ఆఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ కూతురు ఇండియా జియాన్నేకు ఈసారి పెద్ద మొత్తంలో జన్మదిన శుభాకాంక్షలు అందాయి. దాదాపు 120 కోట్ల మంది నుంచి (భారత్ నుంచి) ఆ చిట్టిపాపకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధాని నరేంద్రమోదీ ఆ పాపకు మొత్తం భారతదేశం తరుపున బర్త్‌డే విషెస్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. ‘ఇండియా నుంచి నీకు జన్మదిన శుభాకాంక్షలు ఇండియా’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
జాంటీ రోడ్స్ తన కూతురుకు ఇండియా అని పేరు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆదివారం ఇండియా పుట్టిన రోజు. తన కూతురు జన్మదినం సందర్భంగా జాంటీ రోడ్స్ ఒక ఫొటోను కూడా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయన స్నేహితులు, బంధువుల నుంచి తమ కూతురుకి జన్మదిన శుభాకాంక్షలు రాగా ఎంతో స్పెషల్‌గా ప్రధాని నరేంద్రమోదీ నుంచి 120మంది భారతీయుల తరుపున విషెస్ అంది వారి కుటుంబాన్ని సంతోషంలో ముంచెత్తాయి. మోదీ ట్వీట్ చేసిన 12 గంటల్లోనే దాదాపు 6,300సార్లు ఈ ట్వీట్‌ను రీ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా మోదీకి రోడ్స్ ధన్యవాదాలు తెలిపారు.
Happy Birthday baby India; 2 today #landofyourbirth pic.twitter.com/RGVxmXRjRv
— Jonty Rhodes (@JontyRhodes8) 23 April 2017
Happy birthday to India, from India. :) https://t.co/DbOZFEKLe9
— Narendra Modi (@narendramodi) 23 April 2017