యూనిఫామ్స్ అమ్ముకుంటున్న పోలీసులు
వెస్ట్ మిడ్ ల్యాండ్: విధులు నిర్వర్తించేందుకు తమకు ఇచ్చిన పోలీసు వస్తువులను వేలానికి పెట్టిన ఘటన వెస్ట్ మిడ్ల్యాండ్లో చోటుచేసుకుంది. దీనిపట్ల పలువురు విస్మయం వ్యక్తం చేయడంతో ప్రస్తుతానికి ఆ చర్యకు దిగిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆ ఇద్దరు పోలీసులు కూడా ఆన్ లైన్ వ్యాపార సంస్థ ఈబే ద్వారా విక్రయించారు. దీంతో ఆ వస్తువులను ఈ బే సంస్థ అమ్మకానికి పెట్టడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
ఒక పోలీసు అధికారి 1960నాటి హెల్మెట్స్, హ్యాండ్ కప్స్ అమ్మకానికి పెట్టగా.. మరో పోలీసు అధికారి తన మోటర్ సైకిల్ బూట్లు వేలానికి పెట్టాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా పోలీసు వస్తువులు ప్రస్తుతం ఈ బేలో వేలానికి పెట్టారు. ఈ బే సంస్థ తొలుత వాటిని విక్రయానికి ఉంచేందుకు నిరాకరించినా అది తమ వ్యక్తిగత వస్తువులు, విషయాలంటూ విక్రయాలకు పెడుతున్నారని ఇది ఇప్పుడే తమ దృష్టికి వచ్చిందని ఓ పోలీసు ఉన్నతాధికారి చెప్పాడు. విక్రయాలకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకుంటామని, మిగితా అధికారులెవరూ ఈ పనులకు దిగొద్దని హెచ్చరించారు.