పదేళ్ల బాలుడి నిర్వాకం.. మైనర్‌ బాలిక గర్భవతి..! | Pregnant Girl Say Ten Year Old Boyfriend is Father | Sakshi
Sakshi News home page

పదేళ్ల బాలుడి నిర్వాకం.. మైనర్‌ బాలిక గర్భవతి..!

Published Tue, Jan 28 2020 9:03 PM | Last Updated on Tue, Jan 28 2020 9:05 PM

Pregnant Girl Say Ten Year Old Boyfriend is Father - Sakshi

మాస్కో : ఓ మైనర్‌ బాలిక, బాలుడి మధ్య ఏర్పడిన సంబంధం వారి బంధువులనే కాక దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఓ 13 ఏళ్ల బాలికను 11  ఏళ్ల బాలుడు తల్లిని చేసి అందరినీ ఆశ్చర్య పరిచాడు. ఈ ఘటన రష్యాలోని ఓ ముఖ్య పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు... బాలిక గతకొంత కాలంగా కడపు నొప్పి, శారీరక మార్పులతో కనిపించడం చూసిన ఆమె తల్లిదండ్రులు బాలికను సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల అనంతరం ఆమె గర్భవతి అని వైద్యులు నిర్థారించారు. దీంతో బాలిక తల్లిదండ్రులు ఈ  విషయంపై ఆమెను నిలదీయడంతో అసలు విషయం బయటపెట్టింది. 11 ఏళ్ల తన ప్రియుడు చేసిన నిర్వాకం కారణంగా తాను గర్భం దాల్చాల్సి వచ్చిందని చెప్పింది.

దీంతో వైద్యులతో పాటు స్థానికులు షాక్‌కు గురయ్యారు. 11 ఏళ్ల బాలుడి చర్య వల్ల గర్భం వచ్చే అవకాశం లేదని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బాలుడి బందువులు కూడా స్పందించారు. ఘటనతో తమకు ఎలాంటి సంబంధంలేదని తేల్చిచెబుతున్నారు. అవసరమైతే వైద్య పరీక్షలకు సైతం తాను సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మరోవైపు 11 ఏళ్ల బాలుడు ఓ బాలికను గర్భవతిని చేయగలడా అనేది రష్యాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వైద్యుల పరీక్షల అనంతరం అసలు నిజం బయటకురానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement